Year End 2023: ప్రేక్షకులను ఉర్రూతలూగించిన టాప్ 10 చిత్రాలివే.. 2023లో ఈ హిట్ చిత్రాలను మీరు చూశారా?
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అద్భుతమైన చిత్రాలు విడుదల అయ్యాయి. ముఖ్యంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సూపర్ డూపర్ హిట్టు చిత్రాలు 2023లో చాలానే వచ్చాయి. పండుగలు, పబ్బాలతో పాటు ప్రతీ శుక్రవారం కొత్త కొత్త సినిమాలు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కామెడీతో పాటు ఏడిపించే, భయపెట్టే.. ఫుల్ గా ఎంటర్ టైన్ చేసే ఎన్నెన్నో చిత్రాలు విడుదల అయినప్పటికీ కొన్ని మాత్రం ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అవి ఎప్పటికీ అలాగే నిలిచిపోయే చిత్రాలు. అయితే అలాంటి హిట్ టాప్ 10 చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది అంటే 2023లో దేశ వ్యాప్తంగా విడుదల అయిన టాప్ 10.. మోస్ట్ పాపులర్ సినిమాల లిస్టున్ ఐఎండీబీ విడుదల చేసింది. థియేటర్లతో పాటు ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన టాప్ 10 చిత్రాలను తెలిపింది. అయితే హిట్టుగా నిలిచిన ఆ సినిమాలు ఏవి, ఏ భాషలకు చెందిన చిత్రాలు ఎక్కువగా టాప్ లో నిలిచాయో మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థలు అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జీ5, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాల్లో నేరుగా విడుదలై అయి హిట్లుగా నిలిచిన చిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఐఎండీబీ టాప్ 10 మోస్ట్ పాపులర్ 2023 థియేటర్ సినిమాలివే..!
1. జవాన్
2. పఠాన్
3. రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని
4. లియో
5. ఓఎంజీ 2
6. జైలర్
7. గదర్ 2
8. ద కేరళ స్టోరీ
9. తూ జ్యూటీ మై మక్కార్
10. భోళా
ఐఎండీబీ టాప్ 10 మోస్ట్ పాపులర్ 2023 ఓటీటీ సినిమాలివే..!

2. జానే జాన్
3. మిషన్ మజ్నూ
4. బవాల్
5. చోర్ నికల్ కే భాగా
6. బ్లడీ డాడీ
7. సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై
8. గ్యాస్ లైట్
9. కాథల్: ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ
10. మిసెస్ అండర్ కవర్


Click it and Unblock the Notifications











