ప్రభాస్‌పై పాయల్ రాజ్‌పుత్ కామెంట్.. ఛాన్స్ దొరకాలే గానీ అంటూ సెన్సేషన్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌పై బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కన్నుపడింది. తొలి సినిమాతోనే తనలోని బోల్డ్‌నెస్ బయటపెడుతూ సంచలనం సృష్టించిన పాయల్.. టాలీవుడ్ మోస్ట్ పాపులర్ బ్యాచిలర్ ప్రభాస్‌ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాయల్ మాట్లాడిన తీరు జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ పాయల్ ఏమందో చూద్దామా..

RDX లవ్ ప్రమోషన్‌లో భాగంగా

RDX లవ్ ప్రమోషన్‌లో భాగంగా

మొదటి సినిమా Rx 100 తో యువతను బాగా అట్రాక్ట్ చేసిన పాయల్.. మరికొద్ది రోజుల్లోనే RDX లవ్ అనే మరో రొమాంటిక్ మసాలా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తి రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్, ప్రభాస్‌పై ఆసక్తికర కామెంట్ చేసింది.

ప్రభాస్‌లో స్పార్క్ ఉంది.. ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైల్

ప్రభాస్‌లో స్పార్క్ ఉంది.. ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైల్

ఇంటర్వ్యూలో భాగంగా.. ప్రభాస్, విజయ్ దేవరకొండలలో మీకు ఎవరు ఎక్కువ హాట్‌ అనిపిస్తారు? ఎవరితో కలిసి నటించాలని వుంది? అని ప్రశ్నించింది యాంకర్. దీంతో వెంటనే స్పందించిన పాయల్.. తనకు ప్రభాస్ అంటే ఎక్కువ ఇష్టమని చెప్పింది. ఆయనలో ఏదో స్పార్క్ ఉంటుందని, అందుకే ఆయనంటే అమితమైన పిచ్చి అని పేర్కొంది. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ తనకు బాగా నచ్చుతాయని.. ఛాన్స్ రావాలే గానీ ఆయనతో నటించేందుకు రెడీ అని చెప్పింది.

RDX లవ్ మూవీ

RDX లవ్ మూవీ

పాయల్ లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా 'RDX లవ్'. హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. 'హుషారు' మూవీ ఫేం తేజస్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాధన్ సంగీతం అందిస్తుండగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బోల్డ్ సినిమానే అంటూ ఓపెన్

బోల్డ్ సినిమానే అంటూ ఓపెన్

RDX లవ్ బోల్డ్ సినిమానే అని, మీ ఫ్యామిలీతో కలిసి చూడాలంటే కాస్త సిగ్గుగానే ఉంటుంది.. కానీ అందరిలో ఈ విషయాల పట్ల అవగాహన తీసుకురావాలనే ప్రయత్నమే ఈ సినిమా అని చెప్పింది పాయల్. ఈ కంటెంట్ అందరికీ నచ్చుతుందనే నమ్మకం తనలో ఉందని ఈ సందర్బంగా ఆమె పేర్కొంది.

వెంకీమామతో రొమాన్స్..

వెంకీమామతో రొమాన్స్..

మరోవైపు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న వెంకీమామ సినిమాలో నటిస్తోంది పాయల్. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ తో ఆమె రొమాన్స్ చేస్తుండటం విశేషం. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా నాగచైతన్య, మారో హీరోయిన్‌గా రాశి ఖన్నా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X