హీరో విజయ్ నివాసంపై ఐటీ దాడులు.. భారీగా సోదాలు
తమిళ సూపర్‌స్టార్ విజయ్‌కి మరోసారి ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఝలక్ ఇస్తున్నారు. తాజాగా గురువారం ఆయన నివాసంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాశమైంది. ఆయనకు సంబంధించిన పలు నివాసాల్లో ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
గతంలో ఫిబ్రవరి తొలివారంలో చెన్నైలోని విజయ్‌కి సంబంధించిన 38 స్థావరాల్లో దాడులను ఐటీశాఖ నిర్వహించింది. మధురైకి చెందిన నిర్మాత, ఓ నటుడు, ఫైనాన్సియర్‌తో నివాసాల్లో కూడా దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

విజయ్ నటించిన తాజా చిత్రం బిగిల్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించడంతో ఐటీ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు ఈ చిత్రం రూ.300 కోట్లకుపైగా వసూళ్లను సాధించడం తెలిసిందే. ఈ క్రమంలో ఐటీశాఖ తమిళనాడు వ్యాప్తంగా ఐటీదాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు రూ.77 కోట్లు మేర లెక్క తేలని నగదును స్వాధీనం చేసుకొన్నట్టు వార్తలు వచ్చాయి.
విజయ్‌పై ఐటీ దాడుల నేపథ్యంలో కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు ఆయనకు మద్దతు తెలిపారు. కక్షపూరితంగానే దాడులు చేస్తున్నారని, హీరో విజయ్‌ను భయభ్రాంతులకు గురిచేయడానికి చేసిన ప్రయత్నమే అంటూ కాంగ్రెస్ నేత కేఎస్ అళగిరి వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











