హీరో విజయ్ రెమ్యునరేషన్‌ను బయటపెట్టిన ఐటీశాఖ.. బిగిల్, మాస్టర్‌కు ఎంత తీసుకొన్నారంటే

కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ విజయ్ వరుస విజయాలతో దూసుకెళ్తుంటే.. మరో వైపు ఆయన నివాసాలు, ఆఫీసులపై ఆదాయపు పన్ను అధికారులు దాడులతో హోరెత్తించారు. ఫిబ్రవరి తొలివారంలో మొదలైన ఐటీ దాడులు మార్చి 12వ వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజా చిత్రాల విజయ్ రెమ్యునరేషన్‌కు సంబంధించిన షాకింగ్ వివరాలను ఐటీశాఖ వెల్లడించి.. బుధవారంతో దాడులకు ముగింపు పలికింది. ఇటీవల ఆయన నటించిన బిగిల్, త్వరలో రిలీజ్ కాబోతున్న మాస్టర్ సినిమాలు ఎంత తీసుకొన్నారంటే..

ఐటీ దాడులతో దద్దరిల్లిన విజయ్ ఆఫీసులు

ఐటీ దాడులతో దద్దరిల్లిన విజయ్ ఆఫీసులు

ఫిబ్రవరిలో దాదాపు 36 గంటలపాటు ఏకధాటిగా విజయ్ నివాసాలు, ఆఫీసులలో సోదాలు నిర్వహించడం దక్షిణాది చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. ఆ తర్వాత పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఇక మార్చి 12వ తేదీన మరోసారి చెన్నైలో విజయ్ నివాసం పెన్నాయూర్ హౌస్‌కు, ఆఫీసులకు ఐటీ అధికారులు వెళ్లారనే వార్త మీడియాలో బ్రేకింగ్‌లకు దారి తీసింది.

విజయ్ క్లీన్‌చిట్

విజయ్ క్లీన్‌చిట్

గతనెల జరిపిన ఐటీ దాడులపై విజయ్ మేనేజర్లు, కుటుంబ సభ్యులతో ఐటీ అధికారులు వివరణ ఇచ్చారు. స్వాధీనం చేసుకొన్న పత్రాలను తిరిగి ఇచ్చేసి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకొన్నట్టు వార్తలు వచ్చాయి. ఐటీ దాడులకు సంబంధించి విజయ్‌కి వివరణ ఇవ్వడంతోపాటు క్లీన్ చిట్‌ కూడా ఇవ్వడంతో అభిమానుల్లో సంతోషం నెలకొన్నది. తనిఖీల సందర్భంగా అకౌంట్లలో ఎలాంటి తేడాలు లేవని చెప్పినట్టు సమాచారం.

బిగిల్, మాస్టర్ సినిమాలకు

బిగిల్, మాస్టర్ సినిమాలకు

ఐటీశాఖ విడుదల చేసిన తాజా ప్రకటనలో దళపతి విజయ్ రెమ్యునరేషన్ వివరాలను బహిర్గతం చేశారు. బిగిల్ సినిమాకు విజయ్ రూ.50 కోట్లు, మాస్టర్ సినిమాకు రూ.80 కోట్ల రూపాయలు తీసుకొన్నట్టు ఐటీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. విజయ్ తన రెమ్యునరేషన్‌కు తగినట్టుగా పన్నులు కట్టారని, దాంతో ఆయనపై కేసుల క్లోజ్ చేశామని అధికారులు పేర్కొన్నారు.

Recommended Video

Rocking Star Yash On Income Tax Raids | Filmibeat Telugu
మార్చి 15వ తేదీన మాస్టర్ ఆడియో

మార్చి 15వ తేదీన మాస్టర్ ఆడియో

సూపర్ స్టార్ విజయ్‌కి ఐటీ శాఖ నుంచి క్లీన్‌చిట్ రావడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. మార్చి 15వ తేదీన చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో తలపెట్టిన మాస్టర్ ఆడియో ఫంక్షన్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమం మార్చి 15వ తేదీరన సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానున్నది. ఈ చిత్రం ఎప్రిల్ 9వ తేదీన రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X