సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు.. ఎయిర్‌పోర్టులోనే ఐటీ అధికారుల అదుపులో పుష్ప 2 డైరెక్టర్!

తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖుల నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల మెరుపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం తెల్లవారు జామున చేపట్టిన ఈ రైడ్స్ రెండో రోజున కూడా కొనసాగడం టాలీవుడ్‌ను కుదిపేసింది. గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా చాలా మంది ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలు, బంధువుల ఇండ్లపై దాడులు కొనసాగడం ఆందోళనకు దారి తీసింది. అయితే తాజాగా బుధవారం రోజున పుష్ప డైరెక్టర్ సుకుమార్ నివాసంపై కూడా దాడులు జరగడంతో ఈ దాడులు ఇంకా ఎవరిపై జరుగుతాయనే విషయం చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి పండుగకు ముందు, ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో విడుదలైన పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ లాంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్ చిత్రాలుగా విజయాన్ని అందుకొన్నాయి. ఆ క్రమంలో ఆ సినిమాలను నిర్మించిన దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, ఆ సినిమాలకు ఫైనాన్స్ చేసిన సినీ ప్రముఖుల నివాసాలపై ఏకధాటిగా ఐటీ దాడులు జరిగాయి. దాంతో ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనే విషయం అర్తం కాని పరిస్థితులకు దారి తీసింది.

Income Tax official rides on Pushpa 2 Director Sukumar s Home in Hyderabad

ఇదిలా ఉండగా, దిల్ రాజు నివాసం, అలాగే ఆయన బంధువుల ఇండ్లలో కూడా ఐటీదాడులు నిర్వహించినట్టు వార్తలు వచ్చాయి. ఏకంగా ఆయన భార్యను కూడా ఐటీ అధికారులు వదిలిపెట్టలేదు. ఆమెను తమ కస్డడీలోకి తీసుకొని నేరుగా బ్యాంకుకు తీసుకెళ్లారు. ఆమె చేత లాకర్లు తెరిపించి వాటిని కూడా సోదాల చేశారు. ఆమెను అదుపులోకి తీసుకొని బ్యాంక్ వెళ్లిన దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్‌ నివాసంపై కూడా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటిలో సోదాలు జరుపుతూ కొన్ని పత్రాలను, అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. ఐటీ దాడులు నిర్వహిస్తున్న సమయంలో సుకుమార్ హైదరాబాద్‌లో లేకపోవడంతో ఆయనకు సమాచారం అందించారు. దాంతో ఆయన వెంటనే హైదరాబాద్‌కు హుటాహుటిన చేరుకొన్నారు.

హైదరాబాద్ విమానాశ్రయంలోనే సుకుమార్‌ను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొని నేరుగా తన నివాసానికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. ఆయనను కొన్ని ఆర్థిక అంశాలపై ప్రశ్నిస్తూ వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. అంతకు ముందు మైత్రీ నిర్మాతలు రవి శంకర్, యెర్నేనీ నవీన్‌ను ప్రశ్నించారు. పుష్ప 2 వసూళ్లకు తగినట్టుగా ఆదాయపు పన్ను చెల్లింపు జరగలేదు అనే విషయం నిర్ణారణకు వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే సుకుమార్‌ను కూడా విచారిస్తున్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Read more about: pushpa 2 sukumar hyderabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X