Year Ender 2023: అందరూ మెచ్చిన అద్భుతమైన తమిళ చిత్రాలు ఇవే.. ఈ చిత్రాలన్నీ మీరు చూశారా!

ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎప్పటికప్పుడు సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లకు సంబంధించి వివిధ జాబితాలను ప్రకటిస్తుంటుంది. టాప్ మూవీస్, నటులు, నటీమణుల జాబితా విడుదల చేస్తుంటుంది. ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఆయా సమయాల్లో సినీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు, నటీనటులు ఎవరో ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రకటిస్తుంది. ప్రస్తుతం మనం సంవత్సరాంతంలో ఉన్నాం. మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరం గడిచిపోతుంది. 2024లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సమయంలో 2023లో అలరించి, విశేషంగా ఆకట్టుకున్న సినిమాలు ఏవో, ఓర్మాక్స్ మీడియా ప్రకారం టాప్ 5 లో నిలిచిన ఆ చిత్రాలు ఏమిటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

ఓర్మాక్స్ పవర్ రేటింగ్ లో 85 రేటింగ్ పాయింట్లతో టాప్ లో నిలిచిన మూవీ పోర్ థోజిల్. 2023 జూన్ 9వ తేదీన రిలీజైన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. విఘ్నేష్ రాజా, టి.సెంథిల్ పరమశివం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అశోక్ సెల్వన్, శరత్ కుమార్, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఓర్మాక్స్ ర్యాంకింగ్ లో టాప్ లో నిలిచింది.

India Loved Most Liked Tamil Films of 2023 List here Check Details

ఓ కానిస్టేబుల్ తన విధి నిర్వహణలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కింది విడుదల పార్ట్ 1. 82 రేటింగ్ పాయింట్స్ తో టాప్ -2లో నిలిచింది ఈ మూవీ. తమిళ కామెడీ స్టార్ సూరి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు. విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషించారు. 2023 ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ అందుకుంది.

చాలా రోజుల నుంచి మంచి హిట్ లేక తడబడుతున్న తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్.. ఈ ఏడాది జైలర్ చిత్రం ద్వారా ఆ లోటును పూడ్చుకున్నారు. 2023 ఆగస్టు 10వ తేదీన థియేటర్లలో ఈ విడుదలైన ఈ చిత్రం.. విశేష ఆదరణ అందుకుంది. రజినీ కాంత్ మాత్రమే కాకుండా మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, నాగేంద్ర బాబు, సునీల్ లాంటి వారు ఈ సినిమాలో కనిపించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

India Loved Most Liked Tamil Films of 2023 List here Check Details

చిన్నా చిత్రం ద్వారా హీరో సిద్ధార్థ్ మరోసారి తనలోని నటుడిని ప్రేక్షకుల ముందుంచారు. చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీన విడుదలైంది.

India Loved Most Liked Tamil Films of 2023 List here Check Details

లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ జిగరతాండ. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంది. 2023 నవంబర్ 10వ తేదీన వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X