26 ఏళ్లకే మోడల్ ఆత్మహత్య.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
మోడలింగ్ రంగంలో విషాదం చోటుచేసుకుంది. మోడల్ పలు టైటిల్స్ ను గెలుచుకొని ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ మోడల్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కంటతడి పడి పెట్టిస్తోంది. చిన్న వయస్సుల్లోనే మోడల్, అడ్వకేట్ శాన్ రాచెల్ సూసైడ్ చేసుకోవడం తోటి మోడల్స్, సినీ వర్గాల్లో విషాద ఛాయాలను నిలిపింది. ఇక ఆమె సూసైడ్ నోట్ రాసి మరి తను ఆత్మహత్యకు పాల్పడిందని స్థానిక మీడియా హౌజ్ లు తెలియజేస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఆమె పోరాటం ఏంటనే వివరాల్లోకి వెళితే..
ఎవరీ శాన్ రాచెల్?
తమిళనాడులోని యూనియన్ టెరిటరీ పుదుచ్చేరికి చెందిన మోడల్ శాన్ రాచెల్. 1999లో కరమని కుప్పం, పుదుచ్చేరీలో జన్మించింది. ఈమె వయస్సు 26 ఏళ్లు. మోడల్ రంగంలో కొన్నాళ్లుగా యాక్టివ్ గా ఉంటోంది. ఆమె పూర్తి పేరు శంకర ప్రియా గాంధీ. ఆమెకు డార్క్ క్వీన్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. ఆమె తల్లి చిన్న వయస్సులో చనిపోయింది. ఇక తండ్రి డీ గాంధీ. ఆయన వయస్సు 57 ఏళ్లు. శాన్ రాచెల్ ను మోడలింగ్ రంగంలో ఎంతగానో ప్రోత్సహించాడు. ఆమెకు ఇటీవలే వివాహం కూడా అయ్యింది. తన అత్త, భర్తతో కలిసి పుదుచ్చేరీలోనే నివాసం ఉంటోంది.

ఎప్పుడు సూసైడ్ చేసుకుంది?
లోకల్ మీడియా కథనాల ప్రకారం.. ఆమె జూలై 13న కొన్ని మాత్రలను మోతాదుకు మించి తీసుకుంది. దాంతో స్పృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు, ఆమె తండ్రి వెంటనే పుదుచ్చేరీలోని గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మళ్లీ జింపర్ అనే ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈమేరకు వైద్యులు ధృవీకరించారు.
సూసైడ్ నోట్ లో ఇలా..
తను నివాసం ఉంటున్న ప్లాట్ లో సూసైడ్ నోట్ దొరికింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తన భర్త, తన అత్తయ్య కాదని తెలిపింది. తన సూసైడ్ కు వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇక ప్రాథమిక రిపోర్ట్ లో మాత్రం ఆమె కొన్నాళ్లుగా మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, విపరీతమైన లోన్లతో బాధపడుతుందని తెలుస్తోంది. ఆమె ఫ్యాషన్ ఈవెంట్స్ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసి అప్పులపాలైందని పోలీసులు తెలుపుతున్నారు. మరోవైపు ఇక మరేదైనా కారణం ఉందా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కలరిజంపై ఆమె ప్రత్యేక పోరాటం..
చిన్న వయస్సులోనే శాన్ రాచెల్ పలు పోరాటాలు చేసింది. ఆమె బ్యూటీ వరల్డ్, మోడలింగ్ రంగంలో ఉన్న లోపాలు, వివక్షపై పోరాడింది. ముఖ్యంగా కలరిజంపై ఆమె పోరాటం చేసింది. ఈక్రమంలో చిన్న వయసులోనే ఎన్నో విమర్శలను, ఆటుపోటులను దాటింది. ఇక ఆమె మిస్ పుదుచ్చేరి 2020, మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు 2019, మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీతో సహా అనేక టైటిళ్లను గెలుచుకుంది. ఇక చిన్న వయస్సులోనే ఆమె చనిపోవడం పట్ల స్నేహితులు, మోడల్స్ ఎంతగానో విచారం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











