India Top 10 Heroes: మహేష్‌ బాబుకి రామ్ చరణ్‌, అల్లు అర్జున్ షాక్.. నెంబర్‌ 1 ఎవరంటే?

India Top 10 Heroes: ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. దీంతో దాదాపు టాప్ హీరోల అన్ని సినిమాలు కూడా నేషనల్ వైడ్ గా విడుదలవుతున్నాయి. ఆ క్రమంలో ఆ స్టార్స్ కూడా పాన్ ఇండియా వైడ్ గా ఫాలోయింగ్ పెరుగుతోంది. ఈ క్రమంలో టాప్ హీరో ఎవరు అనే చర్చ మరింత హాట్ టాపిక్‌గా మారింది. బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్, బ్రాండ్ వాల్యూ, సోషల్ మీడియా క్రేజ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రముఖ సర్వే సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల 'మోస్ట్ పాపులర్ హీరోస్' పేరిట ప్రత్యేక లిస్ట్‌ను విడుదల చేస్తారు.అలాగే.. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన టాప్ 10 హీరోల జాబితాను విడుదల చేశారు. ఏ హీరో ఏ స్థానంలో నిలిచారు? ఎవరు పడిపోయారు?

ఓర్మాక్స్ మీడియా 'మోస్ట్ పాపులర్ హీరోస్' జాబితాలో ఎప్పటిలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తన అగ్రస్థానాన్ని మరోసారి కాపాడుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఉన్న క్రేజ్, భారీ ప్రాజెక్టులు, గ్లోబల్ ఫాలోయింగ్ అన్ని కలిసి ప్రభాస్‌ను నెంబర్ వన్‌గా నిలబెడుతున్నాయి. ది రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయన హవా ఇంకా కొనసాగుతోంది.

India Top 10 Heroes Feb 2026 Prabhas Leads Allu ajrun Ram Charan Jumps Mahesh Babu drop

రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నిలిచారు. సినిమా ప్రాజెక్టులతో పాటు రాజకీయ రంగ ప్రవేశం, వ్యక్తిగత విషయాలు అన్ని కలిసి విజయ్‌ను నిరంతరం వార్తల్లో నిలబెడుతున్నాయి. అదే సమయంలో మూడో స్థానాన్ని అల్లు అర్జున్ లో నిలబెట్టుకున్నారు. 'పుష్ప' తర్వాత వచ్చిన పాన్ ఇండియా క్రేజ్, కొత్త ప్రాజెక్ట్ చర్చలు చేపట్టారు. అంతే కాకుండా ఇటీవల అల్లు సినిమా అనే భారీ మల్టి ఫెక్స్ థియేటర్ ను ప్రారంభించారు. ఇలా వరుస వార్తల్లో నిలుస్తూ తన స్థానాన్ని బలపరుచుకున్నారు.

ఈసారి పెద్ద మార్పు ఐదో స్థానంలో కనిపించింది. రామ్ చరణ్ అనూహ్యంగా టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో ఏడో స్థానంలో ఉన్న చరణ్, ప్రస్తుతం ఐదో స్థానానికి జంప్ కావడానికి ఆయన చేస్తున్న కొత్త సినిమాల హైప్, ప్రమోషన్స్ కారణమని చెప్పొచ్చు.

ఇదే సమయంలో మహేశ్ బాబు (Mahesh Babu) గత నెల 5 స్థానంలో ఉన్న ఆయన ఈ సారి ఆరో స్థానంలో నిలిచారు. ఆయన కొత్త సినిమా వారణాసి అప్డేట్స్ తక్కువగా ఉండటం కూడా ఈ ప్రభావానికి కారణంగా భావిస్తున్నారు. ఇక ఏడో స్థానంలో కోలీవుడ్ స్టార్ అజిత్ ఉండగా, ఎనిమిదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతున్నారు. ఎన్టీఆర్‌కి సంబంధించిన ప్రాజెక్ట్స్‌పై చర్చలు జరిగినప్పటికీ, ఆయన స్థానం మాత్రం మారలేదు. తొమ్మిదో స్థానంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నిలిచారు.

ఈ లిస్ట్‌లో ముఖ్యమైన హైలైట్ ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)మరో సారి టాప్ 10లోకి రావడం, గతంలో కొంతకాలం ఈ జాబితాలో ఉన్న ఆయన, ఇప్పుడు పదో స్థానంలో రీఎంట్రీ ఇవ్వడం విశేషం. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చుట్టూ ఉన్న హైప్, రాజకీయంగా కూడా యాక్టివ్‌గా ఉండటం ఆయన పాపులారిటీ కారణమని చెప్పాలి. ఈ జాబితాను పరిశీలిస్తే.. టాలీవుడ్ హీరోల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాబోయే నెలల్లో కొత్త సినిమాల విడుదలలు, అప్డేట్స్ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

More from Filmibeat

Read more about: prabhas allu arjun ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X