Ind Vs Pak: ఛాంపియన్స్ ట్రోఫిలో చిరంజీవి, సుకుమార్.. ఇండియా, పాక్ మ్యాచ్‌లో మెరిసిన సినీ తారలెవరంటే!
ఛాంపియన్స్ ట్రోఫి 2025 (CT 2025) క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ పోటీలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయేలా చేసింది. అయితే చిరకాల దాయాదుల మధ్య జరుగుతున్న సంకుల సమరాన్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు దుబాయ్‌లో దారి కట్టారు. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో తెలుగు, బాలీవుడ్ తారలతో స్టేడియం కళకళలాడింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..
వరల్డ్ వైడ్‌గా ఉత్కంఠగా మారిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. భారత్‌కు అండగా నిలిచి స్టేడియంలో ఆటగాళ్లకు ఉత్తేజం కలిగిద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు. అంతేకాకుండా దుబాయ్ స్టేడియంలో సన్నీ పా సందడి చేశాడు. జార్ఖండ్ డైనమేట్, మిస్టర్ కూల్ ధోనితో కలిసి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కనిపించాడు. వారిద్దరి కలయికకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హీరో సన్నీ డియోల్ తో స్టార్ స్పోర్ట్స్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ వీక్షిస్తున్న MS.ధోని#SunnyDeol #MSDhoni #Dhoni #INDvsPAK #INDvPAK #PAKvsIND #PAKvIND #ChampionsTrophy2025 #ChampionsTrophy #FBTelugu pic.twitter.com/LmswCwTNdF
— TeluguFilmibeat (@TeluguFilmibeat) February 23, 2025
ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా పుష్ప 2 సినిమాను నిలిపిన దర్శకుడు సుకుమార్ తన ఫ్యామిలీతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు వెళ్లారు. తన భార్య తబితా, కూతురు, కొడుకులతో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. టీవీలో, ఓటీటీ ప్రసారాల్లో సుకుమార్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా దుబాయ్ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. వీఐపీ గ్యాలరీలో దర్జాగా మ్యాచ్ చూస్తూ క్రికెట్ గేమ్‌ను ఆస్వాదించారు. భారత బ్యాట్స్‌మెన్లు ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటే హుషారుగా కనిపించారు. భారత బౌలర్లు వికెట్లు తీస్తుంటే చీర్ చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో చిరంజీవి ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇక ఇండియా మ్యాచ్ విషయానికి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులు చేసి అలౌట్ అయింది. ఆ తర్వాత 242 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు ధాటిగా ఆడి గెలుపు బాటలో దూసుకెళ్తున్నది. కడపటి వార్తలు అందేసరికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 94 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 44 పరుగులు, విరాట్ కోహ్లీ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.


Click it and Unblock the Notifications











