అవినీతి భరతం పట్టే సేనాపతి వస్తున్నాడు.. ‘ఇండియన్ 2’ ఫస్ట్ లుక్

Recommended Video

Indian 2 Movie First Look : Kamal Haasan Returns As Senapathy | ‘ఇండియన్ 2’ ఫస్ట్ లుక్

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ 2.0 తర్వాత మరో బిగ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ఇండియన్ (భారతీయుడు)కు సీక్వెల్ 'ఇండియన్ 2'తో రాబోతున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

అవినీతికి వ్యతిరేకంగా హీరో చేసే పోరాటం నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో జనవరి 18 నుంచి సినిమా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీలో విడుదల కానుంది.

సేనాపతిగా కమల్ హాసన్

ఫస్ట్ లుక్ పోస్టర్లో కమల్ హాసన్ సేనాపతిగా దర్శనమిచ్చారు. 1996లో వచ్చిన భారీయుడు సినిమాలో ప్రాచీన యుద్ధవిద్య మర్మకళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఈ మర్మకళను ప్రధానంగా చూపించబోతున్నట్లు పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది.

చాలా కాలం తర్వాత కాజల్ ఖాతాలో భారీ ప్రాజెక్ట్

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత బిగ్ ప్రాజెక్టులో నటించే అవకాశం రావడంతో చాలా హ్యాపీగా ఉంది. ‘కొత్త ప్రయాణం, కొత్త అనుభూతి... ఇండియన్ 2 సినిమా షూటింగులో ఎప్పుడు జాయిన్ అవుతానో అనే ఎగ్జైట్మెంటులో ఉన్నాను.' అని కాజల్ ట్వీట్ చేశారు.

లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో

లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో

శంకర్ దర్శకత్వంలో 2.0 చిత్రాన్ని నిర్మించి లైకా ప్రొడక్షన్స్ సంస్థ ‘ఇండియన్ 2' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అయితే బడ్జెట్ ఎంత? అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు.

ఆ స్టార్స్ కూడా..?

ఆ స్టార్స్ కూడా..?

ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, శింబు ముఖ్యపాత్రల్లో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్ రైటర్స్ జయమోహన్, కాబిలన్ వైరముత్తు, లక్ష్మి శరవణ కుమార్, యాక్షన్ డైరెక్టర్ జాక్ గిల్, టాడ్ గ్రిఫిత్, పీటర్ హెయిన్స్, కొరియోగ్రాఫర్ బాస్కో పని చేస్తున్నారు. లెగసీ ఎఫెక్ట్స్ సంస్థ స్పెషల్ మేకప్ అందించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X