ముసలోడు.. తెలివైనవాడు.. ప్రాణాంతకుడు: ‘భారతీయుడు 2’ తెలుగు పోస్టర్!
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న 'ఇండియన్ 2' మూవీ షూటింగ్ నేటి(జనవరి 18) నుంచి ప్రారంభమవుతోంది. 1996లో వచ్చిన 'ఇండియన్' చిత్రానికి సీక్వెల్ ఇది. కమల్ హాసన్ ఇందులో స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి పాత్రలో కనిపించబోతున్నాడు.
తెలుగులో ఈ చిత్రాన్ని 'భారతీయుడు 2'గా విడుదల కాబోతోంది. ఈ మేరకు తెలుగు పోస్టర్ విడుదల చేశారు. ''ముసలోడు.. తెలివైనవాడు.. ప్రాణాంతకుడు'' క్యాప్సన్‌తో రిలీజైన ఈ పోస్టర్లో వృద్ధుడి పాత్రలో కమల్ హాసన్ లుక్ ఆకట్టుకుంటోంది.

మొదటి భాగంలో అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల యుద్ధం చేస్తూ వారిని అంతమొందించే సేనాపతి 'భారతీయుడు 2'లో కూడా అలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈసారి సేనాపతి అవినీతి విషయంలో టార్గెట్ చేసేది ఎవరిని? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్ రైటర్స్ జయమోహన్, కాబిలన్ వైరముత్తు, లక్ష్మి శరవణ కుమార్, యాక్షన్ డైరెక్టర్ జాక్ గిల్, టాడ్ గ్రిఫిత్, పీటర్ హెయిన్స్, కొరియోగ్రాఫర్ బాస్కో పని చేస్తున్నారు. లెగసీ ఎఫెక్ట్స్ సంస్థ స్పెషల్ మేకప్ అందించబోతోంది.


Click it and Unblock the Notifications











