Indian 2 pre release review: 28 ఏళ్ల తర్వాత భారతీయుడు..కమల్ కఠోర శ్రమ..కనివినీ ఎరుగని బడ్జెట్‌తో..
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు 2. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న రిలీజైంది.
ఇండియన్ 2 సినిమాలో కమల్ హాసన్, ఎస్‌జె సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహ, జాకీర్ హుస్సేన్, పియుష్ మిశ్రా, గురు సోమసుందరం, డిల్లీ గణేష్, జయప్రకాష్, మనోబాల, అశ్వినీ తంగరాజ్ తదితరులు నటించారు. మ్యూజిక్ : అనిరుద్ రవిచంద్రన్, ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రవివర్మన్ బాధ్యతలను నిర్వర్తించారు.

28 ఏళ్ల ముందు భారతీయుడు చిత్రంతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసిన కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు 2. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. ఇండియన్ 2లో శంకర్ ఏం చెప్పాడు? సేనాపతి క్యారెక్టర్‌ను కమల్ ఎలా హ్యాండిల్ చేశారనే ఉత్కంఠ నెలకొని ఉంది.
ఇండియన్ 2 సినిమాలోని ఐకానిక్ క్యారెక్టర్ సేనాపతి పాత్ర కోసం కమల్ చాలా కష్టపడ్డారు. ఈ వయసులో కూడా ఆయన ఉదయం 3 గంటలకు లేచి ప్రోస్తటిక్ మేకప్ సిద్దమయ్యారు. అలాగే సాయంత్రం వరకు ఆయన అదే మేకప్‌లో ఉండి తనకు నటనపై ఉన్న తపనను చూపించారు అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇండియన్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే.. తమిళం, ఓవర్సీస్‌లో భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి సుమారుగా 4.5 లక్షల టికెట్లు బుక్ మై షోలో అమ్ముడుపోయాయి. సుమారుగా 25 కోట్ల రూపాయల కలెక్షన్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే వచ్చాయి.
ఇండియన్ 2 సినిమా కమల్, శంకర్ కాంబోకు స్టామినాకు అద్దంపట్టాయి. ఈ సినిమా తొలి రోజు 60 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
భారీ బడ్జెట్‌తో రూపొందిన భారతీయుడు 2 లో ప్రపంచవ్యాప్తంగా ఓ సరికొత్త మైలురాయిని క్రియేట్ చేస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ జూలై 12న ఇండియన్ 2 పేరుతో తమిళంలో, భారతీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











