Indian 2 Trailer Review భారతీయుడు 2 ట్రైలర్.. రెండో స్వతంత్ర పోరాటం.. నేతాజీ అడుగు జాడల్లో
దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ నిర్మించిన చిత్రం భారతీయుడు 2 (Indian 2). యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం జూలై 12వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..
అవినీతిపై స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతి చేసిన పోరాటం అధారంగా భారతీయుడు సినిమా రిలీజై అప్పట్లో సంచలన విజయం అందుకొన్నది. దాదాపు 28 సంవత్సరాల అనంతరం ఆ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 వస్తున్నది. హిందీలో హిందూస్థానీ, తమిళంలో ఇండియన్ 2 అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

భారతీయు సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జె సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ, అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ గా వర్క్ చేస్తున్నారు. బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణకుమార్‌లతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
చదువుకు తగ్గ జాబ్ లేదు. జాబ్‌కు తగిన జీతం లేదు. కట్టి పన్నులకు సౌకర్యాలు లేవు. దొంగలించే వాడు దొంగిలిస్తునే ఉంటాడు. తప్పు చేసే వాడు చేస్తూనే ఉన్నాడు అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది ఊరేనా అంటూ అరుస్తుంది.
అయితే మనం వ్యవస్థను తప్పు పడుతూనే ఉన్నాం. కానీ దానిని సరి చేయాలి. కానీ దానికి కొంచెం ప్రయత్నం కూడా చేయడం లేదు. అందర్నీ చీల్చి చెండాడే వేటాడే శునకం రావాలి అని అంటే.. ఎవరున్నారు అంటే.. సేనాపతి అంటూ కమల్ ఎంట్రీ ఇచ్చాడు. కమల్ తనదైన మార్కులో కనిపించిన తర్వాత సిద్దార్థ్.. మళ్లీ ఆయనే రావాలి. ఒక తప్పు చేస్తే.. మళ్లీ తప్పించుకోలేమనే భయం పుట్టాలి అని అన్నారు.

చిన్నప్పుడు అబద్దం ఆడకూడదు.. నిజాయితీగా ఉండాలి. దొంగతనం చేయకూడదు అని నేర్పించారు. మరి ఇప్పుడు అవన్నీ చేయాలని చెబుతున్నారు అని కమల్‌ను సిద్దార్థ్ ప్రశ్నిస్తే.. ఇది రెండో స్వతంత్ర్య పోరాటం. నేను గాంధీ మార్గంలో నీవు, నేతాజీ అడుగు జాడల్లో నేను అంటూ కమల్ చేసిన యాక్షన్ సీన్ అదిరిపోయేలా ఉంది. టామ్ అండ్ జెర్నీ ఆటమొదలైంది అంటూ ట్రైలర్‌ను శంకర్ ముగించాడు.
ట్రైలర్ చూస్తే.. గతంలో వచ్చిన భారతీయుడు సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఎమోషన్స్, యాక్షన్ ఉన్నట్టు.. అంతే మొత్తంలో పాత్రల్లో ఫైర్ కూడా అలానే ఉంది. మ్యూజిక్, కెమెరా డిపార్ట్‌మెంట్ సినిమా ఎలా ఉంటుందో రుచి చూపించాయి.


Click it and Unblock the Notifications











