Indian 2 Twitter Review: శంకర్ ఈజ్ బ్యాక్..కమల్ మరోసారి విశ్వరూపం
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు 2. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానున్నది. 28 ఏళ్ల తర్వాత వస్తున్న భారతీయుడు సినిమా సీక్వెల్‌పై ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అయ్యారంటే?
అమెరికాలో ఇండియన్ 2 సినిమా ఫస్టాఫ్ పూర్తయింది. శంకర్ మార్కు ఎలిమింట్స్ తక్కువగా కనిపించాయి. ఫస్టాఫ్ సినిమా యావరేజ్‌గా ఉంది. భారతీయుడు సినిమాలో ఉన్న మ్యాజిక్ ఫస్టాఫ్‌లో కనిపించలేదు. అనిరుధ్ మ్యూజిక్, గ్రాండియన్ విజువల్స్ బాగున్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇండియన్ 2 విజువల్ గ్రాండియర్. అనిరుధ్ మ్యూజిక్ టెర్రిఫిక్‌గా ఉంద. శంకర్ తరహా స్టోరీ టెల్లింగ్ బాగుంది. ఇప్పటిలానే కమల్ హాసన్ అదరగొట్టారు. కొన్ని సీన్లు యావరేజ్‌గా ఉన్నారు. సెకండాఫ్ పూర్తయితేగానీ ఈ సినిమా రేంజ్ ఏంటో చెప్పలేం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

చిన్నతనంలో భారతీయుడు లేదా ఇండియన్ సినిమా చూసినప్పుడు కమల్ హాసన్ పవర్ హౌస్ నటన, రెహ్మన్ మ్యూజిక్, శంకర్ డైరెక్షన్ చూసి థ్రిల్ అయ్యాను. బిగ్ స్క్రీన్ పై చూసిన అనుభూతి ఇప్పటికీ నాకు గుర్తుంది. భారతీయుడు 2 సినిమాను కూడా మిస్ చేసుకోవద్దని.. చూడాలని వెయిట్ చేస్తున్నాను అని ఓ అభిమాని ట్వీట్ చేశారు.
హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ.. శంకర్ సార్, కమల్ హాసన్ సార్ సినిమాలను, వారి కల్ట్ మూవీస్‌ను చూస్తూ పెరిగాను. సేనాపతి అనే ఐకానిక్ క్యారెక్టర్‌లో కమల్ హాసన్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. భారతీయుడు 2 సినిమా టీమ్ కంగ్రాట్స్ అని అన్నారు.
ఇండియన్ 2 సినిమా గ్రాండియర్ మూవీ అనడానికి ఓ సిగ్నేచర్. ఈ సినిమాలో ప్రముఖ నటులే కాదు.. తెర నిండా ఆర్టిస్టులతో కనువింద్ చేశారు శంకర్. డైరెక్టర్ శంకర్ ఈజ్ బ్యాక్. అనిరుధ్ బీజీఎం, పాటలు అదిరిపోయాయి.
ఇండియన్ 2 యూఎస్ఏ ప్రీమియర్‌కు ప్రేక్షకులు పోటెత్తారు. సినిమా ఆరంభంలో ఉండే టైటిల్ కార్డును చూస్తే మతిపోయింది. ఈ టైటిల్ కార్డుకు రేటింగ్ ఇవ్వండి అంటూ ఓ నెటిజన్ తన ఉత్సాహాన్ని చూపించారు.
ఇండియన్ 2 సినిమా బాగుంది. ఈ సినిమాతో శంకర్, కమల్ సార్ కాంబినేషన్ హిట్ అని తేలిపోయింది. వారిద్దరికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











