Indian 3 Trailer Review:1000 కత్తుల పదనుతో సేనాపతి.కార్గిల్ యుద్ధంతో నష్టం ఏమిటో తెలుసా? శంకర్ స్కెచ్ అదుర్స్!

ఇండియన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై మిశ్రమంగా స్పందన వ్యక్తమవుతున్నది. ఈ చిత్రం ముగింపులో ఇండియన్ ట్రైలర్‌ను చూపించారు. అయితే ఇండియన్ 2 మొత్తం సినిమా ఇవ్వని ఫీలింగ్‌ను ఇండియన్ 3 ట్రైలర్ ఇవ్వడంతో ప్రేక్షకుడికి కొంత ఉత్సాహం, ఉత్తేజం కలిగిందనే చెప్పాలి. అయితే భారతీయుడు 3 సినిమా కథ ఏంటి? వీరశేఖరన్ సేనాపతి ఏం చేయబోతున్నాడనే వివరాల్లోకి వెళితే..

ఇండియన్ 2 మూవీ క్లైమాక్స్‌లో వీరశేఖరన్ సేనాపతి సీబీఐ, పోలీసుల ముట్టడి నుంచి తప్పించుకొని వెళ్తాడు. అయితే ఆయన తప్పించుకొని వెళ్లిన తర్వాత ఓ వీడియో లింక్‌ను సీబీఐ ఆఫీసర్‌కు, చిత్రం అరవిందన్‌కు వాట్సాప్‌లో పంపించి.. నా కోసం ఐదు నిమిషాలు మీ సమయాన్ని వెచ్చించండి అని చెబుతాడు.

Indian 3 Trailer Review Shankar rises bar with Senapathy in part 3 than Indian 2 movie

సమాజంలో ఇప్పుడు జరుగుతున్న కేవలం నిరసన మాత్రమే. కానీ అప్పుడు జరిగింది మాత్రం యుద్ధం. మీకు కార్గిల్ వార్ గురించి తెలిసి ఉన్నట్లయితే.. భారత సరిహద్దును చైనా ఆక్రమించింది. యుద్దాలు మీ ఇంటి ముందుకు ఎప్పుడు రావు. ఓ యుద్దం వచ్చిందంటే.. ఎందరి ప్రాణాలు పోతాయో, ఎంత మంది రక్తాన్ని చిందించాల్సి వస్తుందో తెలియదు అని చెబుతుంటాడు.

ఆ యుద్ద సమయంలో మహిళల మాన ప్రాణాలు, పిల్లల హత్యలు, జరగ కూడని అకృత్యాలు జరిగిపోతాయి. వినిపించని ఆక్రందనలు మీకు వినిపిస్తాయి. వాటి వల్ల ఎంత బాధ, మానసిక క్షోభ కులుగుతో చెప్పలేం. ఒక యుద్దం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలియదు. 1806 నుంచి బ్రిటీష్ వారితో జరిగిన స్వాతంత్ర్య పోరాటం నుంచి ఇప్పటి వరకు ఎన్నో తరాలు రక్తాన్ని చిందించాయి. దాని వల్లనే మనం స్వేచ్ఛావాయువులు పీల్చుతున్నాం అని సేనాపతి ట్రైలర్ ప్రజలకు బోధించే ప్రయత్నంలో ఉంటాడు.

Indian 3 Trailer Review Shankar rises bar with Senapathy in part 3 than Indian 2 movie

వీరశేఖరన్.. అతడిని చరిత్ర మరిచిపోయింది. అతడు వన్ మ్యాన్ ఆర్మీగా ప్రజల కోసం ముందుకు వచ్చాడు. అతడు ఓ గొప్ప వారియర్. రక్తపు మరకలతో చరిత్రను తిరగరాశారు. పోరాట వీరుడు.. స్వాతంత్ర్య ఉద్యమ నేత.. 1000 కత్తలకు ఎంత పదను ఉంటుందో.. అలాంటి వాడు. అలాంటి పులి కథను వినాలి. అతను కత్తిపడితే.. యుద్ద తుఫాను సృష్టిస్తాడు. ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ.. మేము తమిళ పోరాట యోధులమని గర్వంగా చెప్పుకొంటాం అంటూ కథ చెప్పి.. జనాన్ని చైతన్య పరుస్తాడు. ఇండియన్ 3 2025 సంవత్సరంలో రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Read more about: indian 3 kamal haasan indian 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X