twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ దేశాన్ని రాముడు పాలిస్తున్నా కరోనాపై ఇదే చెప్పేవాడు.. దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్

    |

    కరోనా ధాటికి ప్రపంచమంతా వణికిపోతోంది. మన దేశంలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఇప్పటికే 400మందికిపైగా కరోనా బారిన పడ్డారు. అందులో పది మంది దాకా మరణించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కొన్ని రాష్ట్రాలు పూర్తిగా షట్ డౌన్ అయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాలు మార్చి 31 వరకు లాక్ డౌన్‌ను విధించాయి. ఇంతలా భయపెడున్న కరోనాపై ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది.

    కరోనా కట్టడికి చర్యలు..

    కరోనా కట్టడికి చర్యలు..

    కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వ్యర్థమే అవుతున్నాయి. రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. వారం క్రితమే జనసమూహాలుండే ప్రదేశాలన్నింటిని మూసి వేయగా ప్రస్తుతం పూర్తిగా షట్ డౌన్ చేసేశారు.

    విస్తృత ప్రచారం..

    విస్తృత ప్రచారం..

    కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే తీసుకోవాల్సి జాగ్రత్తలను వివరిస్తూ.. అందరికీ అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఈ సమయంలోనే సెలెబ్రిటీలందరూ తమ వంతు బాధ్యతగా కరోనా వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వీడియో సందేశాల ద్వారా తెలిపారు.

    కరోనాపై కామెంట్స్..

    కరోనాపై చక్కర్లు కొడుతున్న ఓ పోస్ట్‌కు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కామెంట్ పెట్టాడు. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందో ఓ సారి చూద్దాం. ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందదు.. కానీ మీరు చెందేలా చేస్తారు. అందుకే ఇంట్లనే ఉండండి. ఆసుపత్రులనేసి సొల్యూషన్ కాదు.. ఎందుకంటే వారే ప్రమాదపు అంచులో ఉన్నారు.. మీరు మాత్రమే దీన్ని ఎదురించగలరు. అందుకే ఇంట్లోనే ఉండండి.. ఇదేమీ ఫ్లూ కాదు.. దీనికి నివారణ లేదు.. అందుకే ఇంట్లోనే ఉండండి.. బయట జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.. అందుకే ఇంట్లోనే ఉండండి.. అని ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది.

    రాముడైనా ఇలాగే..

    రాముడైనా ఇలాగే..

    ఇలా వైరల్ అవుతున్న పోస్ట్‌కు ఇంద్రగంటి చేసిన కామెంట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఒక వేళ ఈ దేశాన్ని రాముడు పరిపాలిస్తున్నా.. ఆయన కూడా ఇదే చెప్పేవాడు..పైగా బయట తిరిగే వారికి కఠిన శిక్షలు విధించేవాడంటూ కామెంట్ చేశాడు. ఈ ట్వీట్‌కు మంచు మనోజ్ రిప్లై ఇస్తూ.. నిజమే సర్ అని పోస్ట్ చేశాడు.

    English summary
    Indraganti Mohan Krishna Comments On Corona And Quarantine. Even if Lord Ram was ruling this country, he would tell his subjects the same. And would give a solid whack to all the numbskulls, who want to organize large gatherings
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X