నాని జీవితాన్ని మలుపు తిప్పిన రోజున V విడుదల.. నిజంగా ఇదొక వింత
నాని కెరీర్ మొదలైనప్పుటి నుంచి కూడా సినిమాల విడుదల విషయంలో పెద్దగా ఇబ్బంది పడింది లేదు. మినిమామ్ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సెట్ చేసుకున్నాడు. ముఖ్యంగా సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకున్నా కూడా నాని తన పెర్ఫెమెన్స్ తోనే హైప్ క్రియేట్ చేయగలడు.
అయితే మొదటిసారి నాని తన 25వ ల్యాండ్ మార్క్ మూవీని థియేటర్స్ లో కాకుండా ఓటీటీ వరల్డ్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నాడు. కరోనా వైరస్ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన నాని V సినిమా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న విడుదల కానుంది. గత కొన్ని వారాలుగా ఈ విషయంపై అనేక రకాల కన్ఫ్యూజన్స్ నెలకొనగా నేడు చిత్ర యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది.

అయితే సెప్టెంబర్ 5 అంటే నానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే అదే రోజు నాని మొదటి సినిమా అష్టాచమ్మా విడుదలయ్యింది. ఆ సినిమాకు కూడా మోహన్ కృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. ఇక అష్టాచమ్మా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హీరోగా కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన ఆ సినిమా విడుదలయిన రోజే అనుకోకుండా 25వ సినిమా V విడుదల అవుతోంది. మరి సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చెలుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











