విశ్వంభరకు అంజికి లింక్.. ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మెగాస్టార్?
గడిచిన ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో టాలీవుడ్ పరిశ్రమలో చాలానే మార్పులు వచ్చాయి. కానీ పంచభూతాలు ఎలాగైతే శాశ్వతం అంటారో అదే రీతిలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అండ్ మార్కెట్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటికీ కూడా పదిలంగానే ఉండిపోయాయి అని చెప్పి తీరాలి. కాగా ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో చిరు దాదాపు నాలుగు జెనరేషన్ లు చూసేసారు.
కానీ ఈ అన్ని జెనరేషన్ లలో కూడా పోటీ ఇచ్చి భారీ మార్కెట్ తో దూసుకెళ్తున్న వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇలా ఇప్పుడు కూడా పలు భారీ చిత్రాలు మెగాస్టార్ దగ్గరకి వస్తుండగా అలా తాను చేస్తున్న మరో విజువల్ వండర్ ట్రీట్ సినిమానే "విశ్వంభర". కాగా ఈ చిత్రాన్ని కేవలం ఒక్క సినిమా ఎక్స్ పీరియన్స్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా ఎన్నో అంచనాలు దీనిపై నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా కోసం మెగా అభిమానులు అంతలా ఆసక్తి చూపడానికి గల ఉన్న కారణాల్లో ఈ సినిమా స్ట్రైట్ ప్రాజెక్ట్ కావడం పైగా మెగాస్టార్ కెరీర్ లో వండర్స్ సెట్ చేసిన ఫాంటసీ జానర్ లోనిది కావడం మూలాన ఇంత హైప్ సెట్ అయ్యింది. అయితే చిరు కెరీర్ లో మంచి ఫాంటసీ సినిమాలు అంటే గుర్తొచ్చే మొదటి రెండు సినిమాలు "జగదేక వీరుడు అతిలోక సుందరి" అలాగే "అంజి" సినిమాలు అని చెప్పాలి.
కాగా వీటిలో అంజి సినిమా అయితే ఒక్క చిరు అభిమానుల్లోనే కాకుండా టోటల్ టాలీవుడ్ లోనే ఒక క్లాసిక్ గా నిలిచింది. అప్పట్లోనే హై ఎండ్ వి ఎఫ్ ఎక్స్ తో దర్శకుడు కోడి రామకృష్ణ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. దీనితో ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. మరి ఈ సినిమాకి ఇప్పుడు విశ్వంభర సినిమాకి ఫాంటసీ జానర్ అనే అంశం కాకుండా మరో అంశం కామన్ గా కనిపిస్తుంది.

అప్పట్లో అంజి సినిమాని దాదాపు ఆరేళ్ళు తెరకెక్కించారని టాక్ ఉంది. అయితే ఆ సినిమాలో దాదాపు చిరు ఎక్కువ శాతం ఒకే కాస్ట్యూమ్ లో కనిపిస్తారు. కాగా ఈ విషయాన్ని కోడి రామకృష్ణ గారు కూడా చెప్పారు. వేసిన షర్ట్ నే చిరు మార్చకుండా వేశారని తెలిపారు. మరి మళ్ళీ ఇప్పుడు ఇదే తరహాలో విశ్వంభర కి కూడా జరుగుతుంది. సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ఏ పిక్, పోస్టులు చూసినా కూడా చిరు దాదాపు ఒకే కాస్ట్యూమ్ లో కనిపిస్తున్నారు.
దీనితో ఈ సినిమాలో కూడా దాదాపు చిరు ఎక్కువ శాతం ఒకే కాస్ట్యూమ్ లో కనిపించే అవకాశం ఉందని చెప్పాలి. మరి అప్పుడు చేసిన అంజి కల్ట్ క్లాసిక్ అయ్యింది. ఇక ఇప్పుడు విశ్వంభర ఏమవుతుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాకి ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు చిరంజీవి కెరీర్ లో రెండో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా దీనిని నిర్మాణం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











