మెగాస్టార్, కొరటాల చిత్రం ప్రారంభమయ్యేది ఎప్పటి నుంచో తెలుసా!
రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరు చాలా గ్యాప్ తీసుకుని సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ప్రారంభించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు చిరు, కొరటాల శివ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. కొరటాల శివ చాలా రోజులుగా చిరంజీవితో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు.
చిరు నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం ఇంకా పూర్తి కాలేదు. దీనితో కొరటాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఆగష్టు లోపు సైరా చిత్రం షూటింగ్ పూర్తి కానుందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రమే మిగిలి ఉంటాయి. దీనితో ఆగష్టు నెలలోనే కొరటాల శివ చిత్రాన్ని ప్రారంభించాలని చిరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోందనే వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంలో హీరోయిన్ల పాత్రల విషయంలో నయనతార, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. శృతి హాసన్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని అద్భుతమైన సందేశాత్మక అంశాలతో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











