twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడి కొత్త సినిమా విశేషాలు!

    |

    భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచంలోని సినీ అభిమానులంతా కొందరు దర్శకులు తెరకెక్కించే చిత్రాల కోసం ఎంతగానే ఎదురుచూస్తుంటారు. జేమ్స్ క్యామరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్, క్రిస్టఫర్ నోలెన్ లాంటి దర్శకులు ఈ జాబితాకు చెందిన వారే. క్రిస్టఫర్ నోలెన్ ప్రస్తుతం ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 2017లో వచ్చిన డంకర్క్ చిత్రం తర్వాత నోలెన్ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు.

    ఈ చిత్రం తర్వాత నోలెన్ ఏ జోనర్ లో సినిమా తీయబోతున్నాడు అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. నోలెన్ తెరకెక్కించే ప్రతి చిత్రంలో ఏదో ఒక సరికొత్త అంశం ఉంటుంది. ఆయన చిత్రాలు మెదడుకు పనిచెప్పే విధంగా ఉంటాయి. కలలోకి వెళ్లి దొంగతనం చేసే కాన్సెప్ట్ తో ఇన్సెప్షన్ చిత్రాన్ని తెరకెక్కించారు. నోలెన్ తెరకెక్కించిన స్పేస్ నేపథ్యంలో సాగే ఇంటర్ స్టెల్లార్ చిత్రం సర్వత్రా ప్రశంసలు దక్కించుకుంది. ఆ చిత్రంలో నోలెన్ అంతరిక్షానికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలని ఉపయోగించారు.

    Interesting details about Hollywood director Christopher Nolan new movie

    ఇప్పుడు ఎలాంటి అద్భుతం చేయబోతున్నాడు అనే ఆసక్తి నెలకొని ఉంది. నోలెన్ తదుపరి చిత్రం యాక్షన్ నేపథ్యంలో ఉంటుందట. ఈ చిత్రాన్ని నోలెన్ సతీమణి ఎమ్మా థామస్ భారీ బడ్జెట్ లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కూడా మొదలుపెట్టక ముందే 2020 జులై 17 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జాన్ డేవిడ్ వాషింగ్టన్ హీరోగా, రోబర్ట్ పాటిసన్ హీరోయిన్ గా నటించనున్నారు.

    English summary
    Interesting details about Hollywood director Christopher Nolan new movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X