మన్మధుడు 2 కూడా నాగార్జునే.. దర్శకుడు ఎవరంటే!
దాదాపు 16 ఏళ్ల క్రితం విడుదలైన మన్మధుడు చిత్రం నాగార్జున కెరీర్ లో ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. మన్మధుడు చిత్రం నాగార్జునకు మరింతగా లేడీస్ ఫాలోయింగ్ పెంచింది. ఇటీవల కొంత కాలంగా మన్మధుడు చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతోంది వార్తలు వస్తున్నాయి. మన్మధుడు 2 అనే టైటిల్ కూడా నాగార్జున రిజిస్టర్ చేయించినట్లు వార్తలు వచ్చాయి.
కానీ ఈ చిత్రంలో నాగార్జున నటిస్తాడా లేక తన తనయులతో చేస్తాడా అనే సందేహం ఉండేది. తాజగా మరో మారు ఈ చిత్రం గురించి ఆసక్తికర ప్రచారం మొదలైంది. మన్మధుడు 2 లో నాగార్జునే హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున 45 ఏళ్ల మధ్య వయస్కుడిగా నటిస్తాడట. సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో నాగార్జున లుక్ సరికొత్తగా ఉండబోతుందని సమాచారం.

ఈ ఐడియా మొత్తం నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ది అని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు అతడే అని ప్రచారం జరుగుతోంది. చి ల సౌ చిత్రంతో రాహుల్ రవీంద్రన్ మంచి విజయం అందుకున్నాడు. రాహుల్ రవీంద్రన్ చెప్పిన కథ నచ్చడంతో నాగ్ మన్మధుడు 2 కి గ్రీస్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











