ఇద్దరు క్రేజీ హీరోయిన్లతో రాఘవేంద్ర రావు కొత్త చిత్రం!
కమర్షియల్ చిత్రాల విషయంలో టాలీవుడ్ కు సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు రాఘవేంద్ర రావు. దర్శకేంద్రుడిగా ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలని తెరకెక్కించారు. వయసు పైపడిన ఈ సమయంలో కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.
రాఘవేంద్ర రావు చివరగా తెరకెక్కించిన చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. నాగార్జున, రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామ దాసు వంటి చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే కాంబినేషన్ లో వచ్చిన ఓం నమో వెంకటేశాయ చిత్రం నిరాశపరిచింది. తాజాగా రాఘవేంద్ర రావు కొత్త చిత్రానికి కసరత్తు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నగరానికి ఏమైంది ఫేమ్ విశ్వక్సేన్, ఈషా రెబ్బా, నభ నటేష్ ప్రధాన పాత్రలుగా రాఘవేంద్ర రావు ఓ ఆసక్తికర చిత్రానికి ప్లాన్ చేశారట. ఈషా రెబ్బ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలని ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన అరవింద సమేత చిత్రంలో ఈషా రెబ్బ ఎన్టీఆర్ సరసన నటించిన సంగతి తెలిసిందే. ఇక నభా నటేష్ నన్ను దోచుకుందువటే చిత్రంతో గుర్తింపు పొందింది.


Click it and Unblock the Notifications











