రవితేజకు బిగుసుకుపోయే రోగం.. డిస్కోరాజా కథలో ఇదే కీలకం!
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శత్వంలో డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు విఐ ఆనంద్ గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి థ్రిల్లర్ చిత్రాలని రూపొందించాడు. ఈ చిత్రం కూడా అదే తరహాలో సైంటిఫిక్ ఎలిమెంట్స్ తో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో చిత్రంపై ఆసక్తిని పెంచింది.
డిస్కో రాజా కథ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సైంటిఫిక్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా హీరో ఏదోఒక వ్యాధితో బాధపడుతుంటాడు. ఆ అంశం చుట్టూనే కథ నడుస్తుంది. డిస్కో రాజా చిత్రంలో కూడా రవితేజ రెండు విభిన్నమైన కోణాల్లో కనిపిస్తాడట. రవితేజ ఈ చిత్రంలో కొన్ని సందర్భాల్లో బిగుసుకుపోయి రోగం ఉన్న వ్యక్తిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సమస్యని హీరో ఎలా అధికమించాడు, కథ ఎలా సాగుతుంది అనే విషయాలు ఆసక్తిరేపుతున్నాయి.

ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు డిస్కోరాజా చిత్రం చాలా కీలకం కానుంది.


Click it and Unblock the Notifications











