తన హీరోలతోనే సంప్రదింపులు జరుపుతున్న వివి వినాయక్!
వివి వినాయక్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్. వివి వినాయక్ దర్శత్వంలో ఒక్కసారి నటిస్తే తమ మాస్ ఇమేజ్ పెరుగుతుందని హీరోలు భావించేవారు. పక్కా కమర్షియల్ అంశాలతో సినిమాలు రూపొందించి హిట్ కొట్టడం వివి వినాయక్ ప్రత్యేకత. గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, నితిన్ లాంటి హీరోలందరి మాస్ ఇమేజ్ పెంచింది ఈ దర్శకుడే. చిరంజీవి, బాలయ్యతో కూడా విమానాయక్ సినిమాలు చేశారు.
కానీ ఖైదీ నెం 150 మినహా ఇటీవల వినాయక్ కు సరైన విజయం లేదు. అది కూడా రీమేక్ చిత్రం కావడంతో హిట్ క్రెడిట్ వివి వినాయక్ కు దక్కలేదు. ప్రస్తుతం వివినాయక్ తన తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. గతంలో తాను పనిచేసిన హీరోలతోనే వివి వినాయక్ ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా బాలయ్యతో ఓ చిత్రం తెరకెక్కించాలని భావించినా అది కుదిరేలా లేదు. బాలయ్య బోయపాటి శీను దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.

నితిన్, రవితేజ లాంటి హీరోలతో వినాయక్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి తదుపరి చిత్రంపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. వివి వినాయక్ చివరగా తెరకెక్కించిన ఇంటెలిజెంట్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.


Click it and Unblock the Notifications











