twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విదేశాల్లో బాలీవుడ్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్.. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్

    |

    సరైన లొకేషన్ ఉండాలే గానీ రొమాన్స్ చేయడంలో ఉండే కిక్కే వేరు. ఆ కిక్కు కోసం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా విదేశాలకు పయనమవుతున్నాడట. ఈ విషయాన్ని మనం చెప్పుకోవడం కాదండోయ్.. దీనిపై అఫీషియల్ ప్రకటనే వచ్చేసింది. ప్రభాస్ హీరోగా వస్తున్న సాహూ సెట్స్‌పై బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ తో రొమాన్స్ చేసేందుకు ఆస్ట్రియా పయనమయ్యాడు ప్రభాస్. ఆ వివరాలు చూద్దామా.

    కేవలం రొమాంటిక్ మూడ్ కోసం

    కేవలం రొమాంటిక్ మూడ్ కోసం

    ప్రభాస్, శ్రద్ద కపూర్ జంటగా నటిస్తున్న సాహూ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ కేవలం ఒకే ఒక్క పాటను పెండింగ్ లో పెట్టిందట. ఈ పాటలో ప్రభాస్, శ్రద్దాల మధ్య రొమాన్స్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండనున్నాయట. రొమాంటిక్ సాంగ్ లో నటిచాలంటే రొమాంటిక్ మూడ్ తెచ్చే లొకేషన్ కి వెళ్లాలని డిసైడ్ అయిన చిత్రయూనిట్ ఏకంగా విదేశాలకు పయనమైంది.

    ఆస్ట్రియా లోని అందమైన లొకేషన్స్‌లో..

    ఆస్ట్రియా లోని అందమైన లొకేషన్స్‌లో..

    ప్రభాస్, శ్రద్దా కపూర్ పై చిత్రీకరించనున్న ఈ పాట కోసం ఆస్ట్రియా లోని అందమైన లొకేషన్స్‌ ఎంపిక చేశారు దర్శకనిర్మాతలు. ఈ మేరకు కేవలం ఆ ఒక్క సాంగ్ కోసమే ఆస్ట్రియాకు పయనమయ్యారు యూనిట్ సభ్యులు. అక్కడి అందమైన లొకేషన్స్ ప్రభాస్, శ్రద్దా కపూర్ రొమాన్స్‌కి మరింత అందం తెస్తాయని భావిస్తోందట చిత్రయూనిట్.

    గతంలో అబుదాబి.. ఇప్పుడు ఆస్ట్రియా

    గతంలో అబుదాబి.. ఇప్పుడు ఆస్ట్రియా

    బాహుబలి లాంటి భారీ రేంజ్ సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ లో వస్తున్న సినిమా 'సాహో'నే కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అయితే అంచనాలను మించిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో చూడొచ్చని అంటోంది చిత్రయూనిట్. ఒళ్ళు గగ్గుర్లు పొడిచే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఇప్పటికే అబుదాబిలో షూట్ చేయడం జరిగింది. ఇక రొమాంటిక్ సీన్స్ కోసం ఆస్ట్రియా బయల్దేరారు సాహూ టీమ్.

    యాక్షన్, రొమాన్స్ కలగలిపి

    యాక్షన్, రొమాన్స్ కలగలిపి

    ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా సాహూ సినిమా యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే అనుకున్నారంతా. కానీ తాజాగా వచ్చిన ఈ అప్‌డేట్ ద్వారా ఈ చిత్రంలో రొమాన్స్ కూడా ఉండనుందని తేలిపోయింది. అంటే ప్రభాస్ తో పాటు గన్ను పట్టిన ఆ శ్రద్దనే ప్రభాస్ కౌగిలిలో ఎంజాయ్ చేయడం చేయడం చూసేయొచ్చన్నమాట.

    సాహూ మూవీ

    సాహూ మూవీ

    యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సాహూ సినిమా ఆగస్టు 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్ లాంటి భారీ తారాగణం ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Young rebal star Prabhas new movie Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully going on. In this movie tha last song shoting will be in Austria
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X