బంగార్రాజులో నాగ చైతన్య.. తండ్రి కొడుకుల హంగామా!
నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. 2016 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. చాలా కాలం నుంచి నాగార్జున ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. సోగ్గాడే చిన్ని నాయన చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల నాగార్జునకు వినిపించిన కథ నచ్చడంతో ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.
బంగార్రాజు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం గురించి తాజాగా వస్తున్న వార్తలు ఆసక్తిగా మారాయి. నాగ చైతన్య కూడా ఈ చిత్రంలో నటిస్తాడట. సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నాగార్జున బంగార్రాజు, రాము అనే పాత్రల్లో తండ్రి కొడుకులుగా నటించారు.

కళ్యాణ్ కృష్ణ రూపొందించిన సీక్వెల్ లో రాముకు నాగ చైతన్య కొడుకుగా జన్మిస్తాడట. మనవడిని కష్టాలనుంచి గట్టెక్కించేందుకు బంగార్రాజు పైనుంచి దిగివస్తాడని ఇదే ఈ చిత్ర కథ అని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.


Click it and Unblock the Notifications











