twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పీవీ సింధు బయోపిక్.. కీలక పాత్రలో సోనూ సూద్!

    |

    స్టైలిష్ విలన్ గా రాణించడంతో సోనూ సూద్ కు ప్రత్యేక శైలి ఉంది. విలన్ గా చాలా చిత్రాల్లో సోనూ సూద్ పాత్ర హైలైట్ గా నిలిచింది. అరుంధతి చిత్రంలో సోనూ సూద్ పాత్ర ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటుంది. ఇదిలా ఉండగా సోనూ సూద్ కీలక పాత్రలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం సౌత్ లో బయోపిక్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. బ్యాండ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ మెడల్ విజేత సింధు బయోపిక్ తెరకెక్కించేందుకు సోనూ సూద్ సిద్ధం అవుతున్నారు.

    ఈ చిత్రంలో తాను సింధుకు కోచ్ గా నటిస్తున్నట్లు తెలిపారు. సింధు పాత్రలో నటించే సరైన నటి కోసం అన్వేషణ జరుగుతున్నట్లు సోనూ సూద్ తెలిపారు. బాల్యం నుంచి సింధు క్రీడలపై ఆసక్తికతో ఒలంపిక్ మెడల్ విజేత స్థాయి వరకు ఎలా చేరుకుంది అనే అంశాలని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

    Interesting news about PV Sindhu biopic

    ఇప్పటికే మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా సిద్ధం అవుతోంది. ఈ బయోపిక్ లో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం కోసం శ్రద్దా కపూర్ బ్యాండ్మింటన్ లో శిక్షణ పొందుతోంది. సింధు బయోపిక్ కి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.

    English summary
    Interesting news about PV Sindhu biopic. Sonu Sood playing keyrole
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X