ఎన్టీఆర్ బయోపిక్.. రాఘవేంద్ర రావు పాత్రలో ఎవరో తెలుసా!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తుది దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని చరిత్రలో నిలిచిపోయేలా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య స్వయంగా తన తండ్రి పాత్రలో నటిస్తుండడంతో ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే పోస్టర్స్ లో బాలయ్య అదరగొడుతున్నాడు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితం ఎందరో ప్రముఖులతో ముడిపడి ఉంది. ఆ ప్రముఖుల పాత్రల్లో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు.
ఈ చిత్రంలో మొత్తం 9 మంది హీరోయిన్లు వివిధరకాల పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. ఏఎన్నార్ పాత్రలో సుమంత్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పాత్ర కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. రాఘవేంద్ర రావు పాత్రలో ఆయన తనయుడు ప్రకాష్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అడవి రాముడు చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. మేజర్ చంద్రకాంత్, వేటగాడు, కొండవీటి సింహం లాంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ చిత్రాలతో రాఘవేంద్ర రావు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్‌గా మారారు.


Click it and Unblock the Notifications











