లేడి క్రికెటర్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. ఆసక్తిరేపుతున్న డియర్ కామ్రేడ్!
టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం విజయ దేవరకొండ పట్టిందల్లా బంగారం అవుతోంది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన టాక్సీవాలా చిత్రం మంచి విజయం సాధించింది. గీత గోవిందం చిత్రంతో ఈ ఏడాది విజయ్ అదిరిపోయే హిట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో గీత గోవిందం హీరోయిన్ రష్మిక మరోమారు విజయ్ సరసన నటిస్తోంది. గీత గోవిందం చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక పాత్ర గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. రష్మిక ఈ చిత్రంలో తెలంగాణకు చెందిన లేడి క్రికెటర్ గా నటిస్తోందట. రష్మిక మాట్లాడే భాష తెలంగాణ యాసలో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దిగ్గజ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ వద్ద రష్మిక శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నాడు. భరత్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నుంచి వస్తున్న మరో చిత్రం ఇది. వచ్చే ఏడాది డియర్ కామ్రేడ్ ని ప్రేక్షకుల ముందు తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











