తాతమనవళ్లు కాబోతున్న నాగార్జున, నాగచైతన్య!
కింగ్ నాగార్జున ప్రస్తుతం సీక్వెల్ చిత్రాలపై దృష్టిపెట్టాడు. 2002లో వచ్చిన మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 సిద్ధం అవుతోంది ఈ చిత్రాన్ని నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా నాగార్జున మరో బ్లాక్ బస్టర్ చిత్ర సీక్వెల్ కు కూడా రెడీ అవుతున్నాడు.
2016 సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా చిత్రం నాగార్జున కెరీర్‌లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రంలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. బంగార్రాజు పాత్రని కొనసాగిస్తూ ఈ చిత్ర సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం బంగార్రాజు పాత్రలో నాగార్జున, నాగ చైతన్యు తాత మనవళ్లుగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రమ్య కృష్ణ పాత్ర కూడా అలాగే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించిన వివరాలు తేలనున్నాయి.


Click it and Unblock the Notifications











