Vishwambhara: విశ్వంభర‌లో మాస్ ఎపిసోడ్.. చిరంజీవి కెరీర్‌లోనే హైలెట్‌గా ఇంటర్వెల్ బ్యాంగ్!

తెలుగు సినిమా దగ్గర ఒకో హీరో మార్కెట్ ఒకోలా ఉంటుంది. అది కూడా ఒక టైం లో ఒకలా మరో టైం లో ఒకలా ఇలా జెనరేషన్స్ మారే కొద్దీ చాలా మంది హీరోల మార్కెట్ లు మారిపోయాయి. అయితే ఎన్ని తరాలు మారిన మార్కెట్ ని పెంచుకుంటూ వెళ్లిన ఏకైక స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన తెలుగు సినిమా దగ్గర మెగాస్టార్ చిరంజీవే అని చెప్పాలి.

ఎప్పుడో 1980ల నుంచి ఇప్పుడు వరకు కూడా స్టార్డం అండ్ మార్కెట్ ని తన తోటి హీరోల కంటే అప్పుడు నుంచి ఇప్పుడు వరకు భారీ లెవెల్లో పెంచుకుంటూ వచ్చిన ఏకైక హీరోగా మెగాస్టార్ నిలిచారు. అయితే మెగాస్టార్ సినిమాల్లో కొన్ని జానర్ క్రేజ్ ఉంది. అలా బాక్సాఫీస్ ని షేక్ చేసే జానర్ లలో సోషియో ఫాంటసీ జానర్ కూడా ఒకటి. తాను చేసిన అంజి సినిమా కానీ జగదేక వీరుడు సినిమాలు అందుకు మంచ్చి ఉదాహరణలు అని చెప్పొచ్చు.

interesting news on vishwambhara a biggest highlight sequence in chiru

కాగా మళ్ళీ ట్రాక్ లో అది కూడా డైరెక్ట్ సినిమాతో మెగాస్టార్ వస్తే దాని హైప్ ఎలా ఉంటుందో ఇపుడు యువ దర్శకుడు వశిష్టతో చేస్తున్న భారీ బడ్జెట్ ఫాంటసీ చిత్రం "విశ్వంభర" చూపిస్తుంది. ప్రెజెంట్ జెనరేషన్ పాన్ ఇండియా హీరోల మార్కెట్ లకి ధీటుగా ఈ సినిమా కూడా ఇప్పుడు మార్కెట్ చేస్తుండడం చిరు స్టామినాకి ఇది అద్దం పడుతుంది అని చెప్పాలి.

కాగా విశ్వంభర సినిమాలో ఎన్నో ఊహించని హైలైట్స్ ఉండగా వాటిలో ఒక మైండ్ బ్లాకింగ్ సీన్ ని దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించాడు అంటూ రూమర్స్ ఉన్నాయి. అలా ఈ చిత్రంలో చిరు ఒక రెక్కల గుర్రంపై చేసే స్వారీ కానీ ఆ సీన్ లో చేసే సాహసాలు కానీ ఆడియెన్స్ లో ఊహాతీతంగా అనిపిస్తాయట. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఈ సీన్ కోసం తప్పకుండా అంతా మాట్లాడుకుంటారని మెగా కాంపాండ్ వర్గాలు చెబుతున్నాయి.

interesting news on vishwambhara a biggest highlight sequence in chiru

కాగా ఇలాంటి ఎన్నో భారీ విజువల్ ట్రీట్ లు మెగాస్టార్ పై ఈ సినిమాలో ఉంటాయట. మరి చూడాలి ఈసారి మెగాస్టార్ అభిమానులని ఎలాంటి మాయాజాలంలో ముంచెత్తుతారో అనేది. కాగా ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ త్రిష మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా మరో యంగ్ బ్యూటీ ఆశికా రంగనాథ్ కీలక రోల్ చేస్తుంది. ఇంకా భారీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని సుమారు 200 కోట్లకి పైగానే బడ్జెట్ తో తీస్తున్నారని టాక్ ఉంది.

కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 10న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మరి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ ఉంటుందో లేదో అనేది మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇలాంటి గ్రాండ్ హంగులు ఉన్న సినిమాని పాన్ ఇండియా రిలీజ్ కి ఐతే ఫ్యాన్స్ కోరుకుంటారు మరి సమయం దగ్గరకి వచ్చినపుడు ఏమన్నా ఇతర భాషలు రిలీజ్ అనౌన్స్ చేస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Read more about: chiranjeevi trisha vishwambhara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X