Game Changer Leak: గేమ్ ఛేంజర్ క్రేజీ సీన్ లీక్.. అదిరిపోయే సెటప్‌తో రాంచరణ్!
టాలీవుడ్ సినిమా సహా టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం "ఆర్ ఆర్ ఆర్" సినిమా అనే చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి రెండు మెగా ఫోర్సెస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కించడంతో ఇండియా లోనే భారీ మల్టీ స్టారర్ గా కూడా ఇది మారింది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన రామ్ చరణ్ కి ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
దీనితో అక్కడ నుంచి గ్లోబల్ స్టార్ గా మారిపోయిన చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడు అనే సమయంలో అనౌన్స్ చేసిన భారీ చిత్రమే "గేమ్ ఛేంజర్". ఇలా ఇండియాస్ టాప్ దర్శకుడు రాజమౌళితో చేసిన వెంటనే మరో టాప్ ఇండియన్ దర్శకుడు శంకర్ తో చరణ్ సినిమా అనౌన్స్ చేసాడు. కాగా ఇలా శంకర్, రాజమౌళితో సినిమాలు చేసిన ఏకైక ఇండియన్ హీరోగా చరణ్ నిలిచిపోయాడు. అయితే గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలయ్యింది. కానీ ఎంతకీ పూర్తి కావడం లేదు.

2021 లో మొదలైన సినిమా ఇపుడు 2024 సగం ఏడాది పూర్తయిపోయినప్పటికీ ఇంకా బ్యాలన్స్ ఉంది. అలాగని సినిమాపై అంచనాలు తగ్గలేదు. పైగా రీసెంట్ గానే శంకర్ తన మార్క్ మాస్ సినిమా అంటూ కావాల్సినంత ఎనర్జీ ఇచ్చారు. మరి శంకర్ సినిమాల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో అందరికీ తెలుసు. అలాగే తన గత చిత్రాల విషయంలో ఎలాంటి లీక్స్ లేకుండా సినిమాలు చేసేవారు.
ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో శంకర్ సినిమాలకి లీకులు తప్పడం లేదు. కాగా గేమ్ ఛేంజర్ విషయంలో ఐతే ఇప్పటికీ చాలానే వచ్చేసాయి. కానీ ఇప్పుడు ఓ షాకింగ్ సీన్ అయితే లీక్ అయ్యి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఈ సినిమాలో చరణ్ రామ్ నందన్ గా కనిపిస్తాడని తెలిసిందే. ఒక ఎయిర్ పోర్ట్ దగ్గర షూట్ చేసిన ఈ సీక్వెన్స్ కూడా శంకర్ మాస్ ప్లానింగ్ అంటూ అభిమానులు తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. కాగా ఈ సీన్ లో చరణ్ ఓ పొలిటీషియన్ ని ఎయిర్ పోర్ట్ వరకు వెళ్లి మరీ ఆపినట్టుగా కనిపిస్తుంది.

ఇక ఇందులో చరణ్ లుక్స్ కూడా పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లా కనిపిస్తున్నాడు. దీనితో శంకర్ ఇలాంటి సాలిడ్ సీన్స్ తో సినిమాని నింపేసినట్టు ఉన్నారని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారగా దీనిపై నిర్మాణ సంస్థ ఏమన్నా యాక్షన్ తీసుకుంటారో లేదో అనేది చూడాలి. ఇంకా ఈ బరి సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగు హీరోయిన్ అంజలిలు నటిస్తుండగా ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











