బన్నీ, త్రివిక్రమ్ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్!
నా పేరు సూర్య విడుదలైన దాదాపు ఏడాది తర్వాత అల్లు అర్జున్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంచి కథ కోసం ఎదురు చూస్తున తరుణంలో తనకు అచొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ తోనే బన్నీ సినిమా ప్రారంభించాడు. త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాలని మించేలా అల్లు అర్జున్ 19వ చిత్రాన్ని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ప్రచారం జరుగుతోంది. సీనియర్ హీరోయిన్ టబు ఈ చిత్రంలో అల్లు అర్జున్ తల్లిగా కీలక పాత్రలో నటిస్తోంది. తల్లీకొడుకుల అనుబంధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టబు పాత్ర పేరునే టైటిల్ గా పెడితే బావుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. ఈ చిత్రానికి 'అలకనంద' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 24 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఇప్పటికే సిరివెన్నెల సీతా రామశాస్త్రితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. పూజా హెగ్డే బన్నీకి జోడిగా రెండవ సారి నటిస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











