’హరిహర వీరమల్లు’.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. అది మాత్రం ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు వారి సమస్యలనూ పరిష్కరిస్తున్నారు. ఇదిలా ఉంటే... ఆయన సినిమాల విషయంలోనూ అపడప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అటు ప్రజల కోసం పనిచేయాల్సి ఉండటంతో సినిమాలకు కొంచెం గ్యాప్ వస్తుందని, పక్కాగా ఆడియెన్స్, ఫ్యాన్స్ మెచ్చే చిత్రాలు వస్తాయని గతం నుంచే చెప్పుకుంటూ వచ్చారు.
చివరిగా 'బ్రో' చిత్రంతో వెండితెరపై అలరించారు. ఇక నెక్ట్స్ బిగ్ ప్రాజెక్ట్స్ తోనూ సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా మధ్యలో పొలిటికల్ ప్రొగ్రామ్స్, ఎలక్షన్స్, ప్రస్తుతం ప్రజాపాలన చూసుకోవడంతో సినిమాల విషయంలో అనుకున్న స్థాయిలో అప్డేట్స్ రాలేకపోయాయి. కానీ ఇకపై నుంచి త్వరత్వరగానే రానున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ క్రేజీ న్యూస్ అందింది. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రం గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది.

నాలుగేళ్ల కింద ప్రారంభమైన 'హరిహర వీరమల్లు' చిత్రం నేటీకి చిత్రీకరణను పూర్తి చేసుకోలేదు. మొదటిసారిగా పవన్ కళ్యాణ్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ లో నటిస్తుండటంతో ఆ మూవీపై మొదటి నుంచి గట్టిగానే అంచనాలు ఉన్నాయి. అటు ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూనే వస్తోంది. ఏదో కారణంగా చిత్రీకరణకు అంతరాయం కలుగుతూనే వస్తోంది. దాంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తునే ఉన్నారు.
ఇప్పటికే ఈ చిత్రంతో అద్భుతమైన సాంగ్ విడుదలవగా.. తాజాగా మరో అప్డేట్ అందింది. హరిహర వీరమల్లుకు పార్ట్ 1కు సంబంధించిన షూటింగ్ పై క్రేజీ న్యూస్ వచ్చేసింది. ప్రస్తుతం యూనిట్ ఫైనల్ షెడ్యూల్ ను ప్రారంభించిందని నటుడు కబీర్ దుహాన్ సింగ్ తెలియజేశారు. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా షూట్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. దీనిపై ఇంకాస్తా క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి వారం రోజులు సమయం కేటాయించిన సినిమా పూర్తి అవుతుందని ఫిల్మ్ నగర్ లో టాక్.

ఇక ఎట్టకేలకు ఈ చిత్ర షూటింగ్ పూర్తికానుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. షూటింగ్ తర్వాత వరుస అప్డేట్స్ ఇచ్చే పనిలో యూనిట్ ఉందని తెలుస్తోంది. ఇక రిలీజ్ డేట్ లోనూ ఎలాంటి మార్పులుండబోవని, మార్చి 28న ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మొత్తానికి హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ అందనుంది. ఆ తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు రానున్నాయి. ఇక హరిహర వీరమల్లు చిత్రం రెండు భాగాలు రానుంది. క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతి క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ డియోల్, నిధి అగర్వాల్ కీలక పాత్రలో పోషిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











