బాలయ్య సినిమాలో అదే హైలైట్.. ‘రూలర్’లో ఆ సీన్‌కు పునకాలు ఖాయమట.!

By Manoj Kumar P

నందమూరి బాలకృష్ణ.. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో. గతంలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన.. కొద్దిరోజులుగా స్పీడును తగ్గించారు. రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత మరింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్పీడు పెంచేశారు. ఇందులో భాగంగానే కొత్త సినిమా షూటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా బాలకృష్ణ సినిమాకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా వార్త..?

మరో హిట్ కోసం జత కట్టారు

మరో హిట్ కోసం జత కట్టారు

గతంలో ‘జై సింహా' వంటి హిట్ సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో బాలయ్య మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘రూలర్' అనే టైటిల్ పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా, భూమిక, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నారు.

బాలకృష్ణ రెండు షేడ్స్‌లో...

బాలకృష్ణ రెండు షేడ్స్‌లో...

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనిపిస్తున్నారు. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. గ్యాంగ్‌స్టర్ పాత్ర బాలయ్య లుక్స్ ఎక్ట్రార్డినరీగా ఉన్నాయనే చెప్పాలి. ఇక, ఈ సినిమా కథ విషయానికొస్తే.. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనేదే సినిమా కథ అని ఫిలింనగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు.

సరికొత్త లుక్‌లో బాలయ్య

సరికొత్త లుక్‌లో బాలయ్య

ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్లకు సంబంధించిన లుక్స్ కొన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వీటిలో బాలయ్య సన్నగా సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఫ్రెంచ్ కట్ షేవ్‌తో హ్యాండ్సమ్‌గా దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, ఈ పిక్స్‌లో బాలయ్య వయసు తగ్గిపోయిందన్నట్లుగా ఉంది. దీంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ లుక్కుల వెనుక రహస్యం ఇదే

ఆ లుక్కుల వెనుక రహస్యం ఇదే

బాలయ్య ఈ సినిమా కోసం ఎంతగానో కష్ట పడుతున్నారు. తన అభిమానులకు ఎలాగైనా మంచి సినిమాను అందించాలన్న కసితో పని చేస్తున్న బాలయ్య.. అదే సమయంలో తనలో తాను కొంత మార్పులు కూడా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సన్నగా అవడం కోసం ఆయన రోజుకు ఐదు గంటల పాటు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఈ కారణంగానే ఆయన లుక్‌లో వేరియేషన్ కనిపిస్తుంది.

Recommended Video

Cine Box : Suriya’s Aakasam Nee Haddura First Look Is Out || 'రూలర్’లో ఆ సీన్‌కు పునకాలు ఖాయమట.!
ఆ సీన్‌కు పునకాలు ఖాయమట

ఆ సీన్‌కు పునకాలు ఖాయమట

బాలయ్య తాజాగ చిత్రం ‘రూలర్'లో ఓ సీన్ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. అది క్లైమాక్స్‌లో వచ్చే యాక్టన్ సీన్ అని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రాంతంలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో దీని చిత్రీకరణ జరిగిందట. ఈ ఫైట్‌లో దాదాపు ఐదు వందల మంది ఆర్టిస్టులు ఉంటారట. ఈ సీన్‌తో బాలయ్య అభిమానులకు పూనకాలు రావడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X