‘ఆదిపురుష్’ నుంచి ఆసక్తికర అప్‌డేట్: వాటిలా కాకుండా కొత్త కథతో ప్రభాస్ సినిమా

వరుసగా పాన్ ఇండియా సినిమాలను ప్రకటిస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో యూనివర్శల్ స్టార్ అయిన అతడు.. ఆ తర్వాత బడా ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్'తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ పాన్ ఇండియా మూవీ గురించి తాజాగా ఓ ఆసక్తికరమై వార్త బయటకు వచ్చింది.

'ఆదిపురుష్' రామాయణ కాలం నాటి కథతో తెరకెక్కనుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో ప్రభాస్ రాముడిగానూ, సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగానూ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బడా మూవీ రామాయణ కాలం నాటి కథే అయినా.. ఇప్పటి వరకూ చూపించని కొత్త కోణాన్ని ఇందులో టచ్ చేయబోతున్నారట. ఇందుకోసం దర్శకుడు ఓం రౌత్ ప్రత్యేకమైన ప్రణాళికను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ మూవీ కోసం కొన్ని నవళలను కూడా తిరగేశాడని అంటున్నారు.

Interesting Update from Prabhass Adipurush Movie

ఇదిలా ఉండగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో రూపొందే ఈ సినిమాను హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ మూవీలో సీతగా '1 నేనొక్కడినే' ఫేం కృతీ సనన్ నటిస్తుండగా, లక్ష్మణుడి పాత్రను బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ పోషిస్తున్నట్లు బీ టౌన్‌లో తెగ ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X