తమన్‌నే రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్ గా చెబుతున్నారు. అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం తన లుక్ మార్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం బరువు తగ్గి మరింత స్టైలిష్ గా మారాలని త్రివిక్రమ్ బన్నీకి సూచించాడట.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో కొత్త చిత్రం ప్రారంభం కాబోతోంది అనే వార్త మినా ఈ చిత్రానికి సంబంధించి మరే విషయం తెలియలేదు. ఈ హీరోయిన్ , ఇతర నటీనటులు విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ కథకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉండడమే. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి పని చేసే సంగీత దర్శకుడి విషయంలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ, త్రివిక్రమ్ సినిమా అంటే దేవిశ్రీ తప్పనిసరిగా ఉండాల్సిందే.

ఆ మాటకు వస్తే త్రివిక్రమ్ కూడా ఎక్కువగా దేవిశ్రీతోనే పని చేశాడు. కానీ అజ్ఞాతవాసి చిత్రం నుంచి త్రివిక్రమ్ సంగీత దర్శకులని మారుస్తున్నాడు. బన్నీతో తెరకెక్కించే చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అరవింద సమేత చిత్రానికి తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











