twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సరిలేరు నీకెవ్వరూ' మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చెప్పిన అనిల్ రావిపూడి

    |

    మహర్షి సినిమాతో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు.. తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో మహేష్ సరసన క్రేజీ భామ రష్మిక మందన్న నటిస్తుండటం, అలాగే ఈ సినిమా ద్వారానే సీనియర్ హీరోయిన్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం జనాల్లో ఆసక్తికర అంశాలుగా మారాయి. అయితే ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ చెప్పారు.

    మ‌హాన‌టి ఫేం బేబి సాయి తేజ‌స్విని, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రలుగా నటిస్తున్న 'ఎర్రచీర' ఫ‌స్ట్ లుక్ ఆవిష్క‌ర‌ణ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.. అదే వేదికపై తన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాకు సంబందించిన ఓ కీలక విషయాన్ని చెప్పాడు. 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రంలో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన రోల్ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని అనిల్ చెప్పుకొచ్చాడు.

    Interesting update on Anil Ravipudis Mahesh 26

    ఈ సందర్బంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ''రాజేంద్ర ప్ర‌సాద్‌ గారిని నేను డాడి అని పిలుస్తా. నా అన్ని సినిమాల్లో ఆయ‌న ఉంటారు. 'స‌రిలేరు నీకెవ్వ‌రు'లో ఆయ‌న ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో ఆయ‌న‌కు మంచి స‌న్నివేశాలున్నాయి. రాజేంద్ర ప్ర‌సాద్‌ గారికి, మ‌హేష్ బాబు గారికి మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి'' అన్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ సినిమా కావడం, అందునా రాజేంద్ర ప్రాసాద్ రోల్ ఉందంటే ఇక ఆ సినిమాలో కామెడీ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

    ఇక దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ.. అదీ ఓ పవర్ ఫుల్ పాత్రలో, అలాగే జగపతిబాబు విలక్షణ నటన కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ కానుంది. మరోవైపు ఇటీవలే ఎఫ్ 2 సినిమా విజయం ఇచ్చిన జోష్‌లో డైరక్టర్ అనిల్ రావిపూడి ఉన్నారు కాబట్టి మహేష్ 26 తో ఇక 'సరిలేరు నీకెవ్వరూ' అని మహేష్ బాబు అనిపించుకోవడం ఖాయమే అని తెలుస్తోంది.

    English summary
    Rajendra Prasad plays a comedy oriented role on mahesh 26 movie which is directed by Anil Ravipudi. This movie shooting will starts very soon..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X