ప్రపంచం మొత్తం ఎదురుచూసే సినిమా.. నవంబర్ 28న సర్‌ప్రైజ్!
మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న సూపర్ హీరోల చిత్రం అవెంజర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ నెలకొని ఉందో తెలిసిందే. పిల్లపు పెద్దలు అంతా సూపర్ హీరోల విన్యాసాలు ఆస్వాదించేందుకు అవెంజర్స్ చిత్రాల కోసం ఎగబడుతుంటారు. ఈ ఏడాది ఆరంభంలో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ విడుదలై ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులంతా అవెంజర్స్ 4 కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అవెంజర్స్ సిరీస్ దర్శకులు అంథోని రుస్సో, జో రుస్సో మాట్లాడుతూ అవెంజర్స్ 4 గురించి ఆసక్తికర ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది చివర్లో అవెంజర్స్ టీజర్ ట్రైలర్ విడుదల చేస్తాం అని ప్రకటించారు. కానీ ఖచ్చితమైన తేదీ మాత్రం ప్రకటించలేదు.

ఈ నేపథ్యంలో నవంబర్ 28 న అవెంజర్స్ 4 టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని హాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం అవెంజర్స్ 4 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మే 3 న చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











