ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ అప్డేట్.. తిరుపతిలో వైభవంగా!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ అందరిలో ఉత్కంఠ రేపుతోంది. తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. భారీ స్థాయిలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని క్రిష్ అండ్ టీం భావిస్తోంది.
డిసెంబర్ 16న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారట. ఈ కళ్ళు చెదిరే ఈవెంట్ కు టెంపుల్ సిటీ తిరుపతి వేదిక కానుంది. సినీవర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం భారీ స్థాయిలో ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు అతిధులుగా హాజరవుతారట.

బాలయ్య తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. క్రిష్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్ వివిధ ప్రముఖల పాత్రలో మెరవబోతున్నారు. విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని జనవరి 9న విడుదుల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











