ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల చేతుల మీదుగా.. ట్రైలర్ గురించి ఆసక్తికర అప్డేట్!
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతుండడంతో సర్వత్రా ఎన్టీఆర్ బయోపిక్ పై ఉత్కంఠ నెలకొని ఉంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఎలా నటించాడు, ఎలాంటి అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొని ఉంది. ఇదిలా ఉండగా డిసెంబర్ 21న ఈ చిత్ర ఆడియో వేడుక నిర్వహించనున్నారు.
ఆడియో వేడుకలోనే థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ లాంచ్ కోసం చిత్ర యూనిట్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయనున్నారట. ఎన్టీఆర్ నాలుగు కుమార్తెలు గరపాటి లోకేశ్వరి, ఉమా మహేశ్వరి, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆడియో లాంచ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కీరవాణి అందించి ఈ చిత్ర ఆడియో ఆల్బమ్ ని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. బాలయ్య ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో 60కి పైగా గెటప్స్ లో కనిపించబోతున్నాడు. విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, నిత్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హీరో రానా చంద్రబాబు పాత్రలో నటిస్తుండడం విశేషం.


Click it and Unblock the Notifications











