చిత్ర పరిశ్రమపై కేంద్రం వరాల జల్లు.. టికెట్‌పై జీఎస్టీ తగ్గింపు, బాలీవడ్ ప్రముఖుల హర్షం!
నేడు భారత ప్రభుత్వం పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో ఆర్థిక శాఖామంత్రి పీయూష్ గోయల్ చిత్ర పరిశ్రమకు వరాల జల్లులు కురిపించారు. ఇకపై భారతీయ సినిమాల షూటింగ్స్ కోసం సింగిల్ విండో పద్దతిలో అనుమతులు ఇవ్వబోతున్నట్లు పీయూష్ గోయల్ తెలిపారు. ఈ పద్ధతి విదేశాల్లో మత్రమే ఉంది. ఇకపై మన దేశంలో కూడా సినిమాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నారు.
అదే విధంగా వినోదపు భాగంలో సినిమాల టికెట్స్ పై జిఎస్టీని 12 శాతానికి తగ్గించనున్నట్లు తెలిపారు. కేంద్రం సినిమా పరిశ్రమ గురించి చేసిన ఈ ప్రకటనలని పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్వాగతిస్తున్నారు. మధుర్ బండార్కర్, వివేక్ అగ్నిహోత్రి లాంటి దర్శకులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
Welcome move by @narendramodi Government for initiating Anti-Camcording provision in the Cinematography Act to fight Piracy and Single window clearance for Film Shootings.This will help the Film Industry in a Big Way.🙏#Budget2019
— Madhur Bhandarkar (@imbhandarkar) February 1, 2019

కొన్ని రోజుల క్రితం నరేంద్ర మోడీ బాలీవుడ్ ప్రముఖులతో సమావేశమై సినిమాకు సంబంధించిన పలు అంశాలని చర్చించిన సంగతి తెలిసిందే. గతంలో సినిమాపై భారీగా జిఎస్టీని విధించడంపై చాలా మంది అసంతృపిని వ్యక్తం చేశారు. కేంద్రం తాజా నిర్ణయం చిత్ర పరిశ్రమకు ఊరటని కల్పించే విధంగా ఉంది.


Click it and Unblock the Notifications











