RRR Movie Oscars Nominations: ఇంటర్నేషనల్ మీడియాలో అంచనాలు.. ఆ హీరో పేరు ట్రెండింగ్!
ఆస్కార్ బరిలో ఇండియన్ సినిమాలకు గుర్తింపు దక్కిన సందర్భాలు చాలా తక్కువే. అయితే ఈసారి RRR సినిమా ఆ ప్రముఖ ఈవెంట్ లో చర్చనీయాంశంగా నిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అకాడమీ అవార్డ్స్ కోసం నామినేట్ చేయబడే సినిమాల లిస్ట్ అయితే ఆఫీషియల్ గా ప్రకటించక ముందే వైరల్ గా మారుతొంది. ఇక ముందస్తుగా ప్రిడిక్షన్ చేసే కొన్ని ప్రముఖ మేగజైన్ పత్రికలు కూడా RRR సంబంధించిన నామినేషన్ వివరాలను ముందే ఊహించడం ఆసక్తికరంగా మారింది పూర్తి వివరాలలోకి వెళితే..

బిగ్గెస్ట్ హిట్
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన RRR సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా మొదటి సారి కలిసి నటించిన ఈ బిగ్గెస్ట్ ఇండియన్ మల్టీ స్టార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1200 కోట్ల వరకు కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగానూ సినీ ప్రముఖులను ఆకర్షించింది.

ఓటీటీ లో భారీ క్రేజ్
RRR సినిమాను నెట్ ఫ్లిక్స్ ద్వారా చాలామంది విదేశీయులు కూడా వీక్షించారు. ముఖ్యంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసిన తర్వాత రాజమౌళి మేకింగ్ విధానం అద్భుతం అనే పొగిడారు. సోషల్ మీడియాలో చాలావరకు RRR సినిమాకు సంబంధించిన సన్నివేశాలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

ముందుగానే అంచనాలు
అయితే RRR సినిమా తప్పకుండా ఆస్కార్ భరిలో నిలిచే అవకాశం ఉన్నట్లుగా కూడా అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. రాబోయే అకాడమీ అవార్డ్స్‌లో ప్రముఖ మ్యాగజైన్ వెరైటీ.. RRR వివిధ క్యాటగిరిలో బలమైన పోటీదారుగా ఉంటుందని అంచనా వేసింది. అంతకుముందు, ఉత్తమ నటుడు అవార్డుకు పోటీదారుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరని పేర్కొంది. ఇప్పుడు ఇందులో రామ్ చరణ్ పేరు కూడా చేర్చారు.

మొత్తం 5 క్యాటగిరిలో..
ఉత్తమ చిత్రం: RRR
ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి
ఉత్తమ నటుడు: రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: RRR
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: దోస్తీ - ఎంఎం కీరవాణి
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: RRR
ఇలా వివిధ 5 క్యాటగిరిలో RRR ఇతర బిగ్ బజార్ సినిమాలతో పోటీ బార్లో గాని ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

ఫ్యాన్స్ డిమాండ్
ఇదివరకే కొంతమంది భారతీయ సినీ ప్రముఖులు కూడా RRR సినిమా తప్పకుండా ఆస్కార్ భరిలో నిలుస్తుంది అని కూడా నమ్మకంగా తెలియజేశారు. ఇక RRR సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అతని పేరు ఎక్కువగా వైరల్ గా మారుతొంది. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు వెరైటీ మ్యాగజైన్ రామ్ చరణ్ పేరును ప్రస్తావించడం విశేషం. మరి నిజంగానే ఆస్కార్ హడావిడిలో RRR కనిలిస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











