twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెర్రీ, ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'.. వెలుగు లోకి మరో ఆసక్తికర వార్త

    |

    ఆర్ఆర్ఆర్ మొదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఆసక్తి సంతరించుకుంది. దీంతో ఆర్ఆర్ఆర్ కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్ తెలుసుకోవాలని ఆరాట పడుతున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాకు సంబంధించి ఓ చిన్న అప్‌డేట్ వచ్చినా అది తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఎవరైనా పుటించిన రూమరా? లేక నిజమైన వార్తేనా అని కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేరు జనం. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త వెలుగు లోకి వచ్చింది.

    ఆర్ఆర్ఆర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి భాగం కాబోతుందనేది అట్టి వార్తల సారాంశం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే అంటున్నాయి కొన్ని మీడియా వర్గాలు. విజయశాంతి ఆర్ఆర్ఆర్ లో కీలక పాత్ర పోషిస్తోందని, ఎన్టీఆర్ నేపథ్యంలో రానున్న కొన్ని సన్నివేశాల్లో విజయశాంతి పర్‌ఫార్‌మెన్స్ చిత్రానికే తలమానికం కానుందని అంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ కన్ఫర్మ్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. విజయశాంతి ఆర్ఆర్ఆర్ లో నటిస్తుందనేది నిజమే అని భావిస్తున్నారంతా. చూడాలి మరి దీనిపై జక్కన్న రియాక్షన్ ఎలా ఉంటుందో!

    Intersting RRR Update viral on Social Media

    రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోంది ఆర్ఆర్ఆర్ మూవీ. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయాల నుంచి కోలుకోవడంతో ఇక విరామం లేకుండా షూటింగ్ జరపాలని ఫిక్స్ అయ్యారు రాజమౌళి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు వేషం వేసేశాడు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ చెర్రీ సరసన నటిస్తోంది. ఎన్టీఆర్ కోసం హీరోయిన్ కి వెతికే పనిలో ఉన్నారు యూనిట్ సభ్యులు. వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమా విడుదల కానుంది.

    Read more about: rrr ram charan rajamouli
    English summary
    Rajamouli Now directed RRR movie. It will going to realese as fourth movie of ntr, Rajamouli successfull combo. Now this movie shooting in hyderabad with any publicity. As par latest talk Viajayashanthi will plays a importent role in this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X