Sarkaru Vaari Paata: సినిమాలో హైలైట్ ఎపిసోడ్ లీక్.. ఫ్యాన్స్‌కు పూనకాలేనట

హ్యాండ్సమ్ లుక్స్.. అదిరిపోయే యాక్టింగ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకుని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను సైతం భారీగా పెంచుకున్నాడు. ఇక, ఇప్పుడు మహేశ్ సూపర్ డూపర్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. దీనికి కారణం.. ఈ మధ్య కాలంలో అతడు ఏకంగా హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకోవడమే. ఈ ఉత్సాహంతోనే మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం రెండు సినిమాలను లైన్‌లో పెట్టుకున్నాడు.

కొంత కాలంగా వరుస హిట్లతో దూసుకుపోతోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. బ్యాంకులను మోసం చేసి పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎప్పుడో ప్రారంభించినా.. అనివార్య కారణాల వల్ల షూటింగ్ మాత్రం ఏకధాటిగా సాగడం లేదు. దీంతో ఇది మరింత ఆలస్యం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని గ్యాప్ లేకుండా చిత్రీకరణ జరిపి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ధ‌ృడ సంకల్పంతో ఉంది. ఇందుకోసం వరుసగా షెడ్యూళ్ల మీద షెడ్యూళ్లను ప్లాన్ చేస్తున్నారు.

Interval Fight Highlight in Sarkaru Vaari Paata

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీ గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్ హైలైట్‌గా ఉంటుందట. అప్పటి వరకూ బలమైన వర్గంతో ఉన్న విలన్‌ను ఎదుర్కొనేందుకు హీరో సిద్ధం అవుతాడట. ఆ సమయంలో విలన్ గ్యాంగ్‌తో తలపడే సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయని అంటున్నారు. అంతేకాదు, మహేశ్ దమ్కీ ఇచ్చే సీన్ మాత్రం పూనకాలు తెప్పించే విధంగా ప్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట'లో విలన్‌గా ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖని నటిస్తోన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలో మహేశ్ బాబుతో ఆయన తలపడే సన్నివేశాలు చాలా హైలైట్‌గా ఉంటాయట. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్‌ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించన షూటింగ్‌ను హైదరాబాద్ నగర శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుపుతున్నారని తెలిసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబు మాస్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అలాగే, ఇందులో కళావతి అనే పాట సెన్సేషన్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X