NTR30: ఎన్టీఆర్ మూవీ ఇంటర్వెల్ లీక్.. ఇండియాలోనే తొలిసారి ఇలాంటి సీక్వెన్స్

జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఇతగాడు యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, సింగింగ్, డైలాగ్స్ ఇలా ఎన్నో రకాల టాలెంట్లను చూపించి సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. తన కష్టంతోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే, మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను సైతం భారీగా పెంచుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

వరుస హిట్లతో భీకరమైన ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. కొద్ది రోజుల క్రితమే RRR (రౌద్రం రణం రుధిరం) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు, అత్యధిక కలెక్షన్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను కూడా క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా వల్ల తారక్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. ఈ ఉత్సాహంతోనే యంగ్ టైగర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. దీని తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్టుపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఎన్నో రకాల ఆసక్తికరమైన విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. దీంతో ఈ మూవీ తరచూ హైలైట్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా జూలై నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. కానీ, ఈ సినిమా మాత్రం అస్సలు ప్రారంభం కాలేదు. దీంతో ఇది అక్టోబర్‌లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

Interval Sequence Highlight in NTR and Koratala Movie

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివది క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి ఎన్నో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీక్వెన్స్‌ను సముద్రంలో ప్లాన్ చేస్తున్నారట. అందులో కొన్ని ఛేజింగ్ అండ్ బ్లాస్టింగ్ సీన్స్‌ను చూపించబోతున్నారట. ఇది ఇండియాలోనే గతంలో ఎన్నడూ రాని విధంగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనికోసం విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్లను కూడా తీసుకు రాబోతున్నారని సమాచారం. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తీసే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు దేశం మొత్తాన్ని మార్చేలా ఇచ్చే సందేశంతో ఇది రూపొందుతోందట. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X