Devara ఇంటర్వెల్: ఇదెక్కడి మాస్ రా బాబు.. ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలా!
తెలుగు పరిశ్రమ నుంచి వచ్చిన చాలా మంది హీరోలు పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుతోన్నారు. అందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్లతో అతడు స్టార్‌గా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే ఇటీవలే గ్లోబల్ రేంజ్‌కు సైతం చేరుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఎన్టీఆర్ తన 30వ చిత్రంగా 'దేవర'ను చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమా ఐదు భాషల్లో తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.
పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చిలోనే ప్రారంభించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన పలు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే మరో దాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు తాజాగా తెలిసింది. దీనికోసం హైదరాబాద్‌లోని శివారు ప్రాంతంలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చేసింది.

కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఎపిసోడ్ దాదాపు 15 నిమిషాల వరకూ ఉంటుందట. ఇండియాలో ఏ సినిమాలోనూ చూడని విధంగా దీన్ని డిజైన్ చేసినట్లు తెలిసింది. ఈ షూటింగ్‌నే ఇప్పుడు రాబోయే షెడ్యూల్‌లో షూట్ చేయబోతున్నారు. ఇది దాదాపు 20 రోజుల పాటు సాగుతుందని సమాచారం. దీన్ని ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలోని బృందం చిత్రీకరించబోతుంది.

ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తారని ఎప్పుడో అనౌన్స్ చేశారు.


Click it and Unblock the Notifications











