గుంటూరు కారం ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్.. ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సిన ట్రీట్
మరోసారి సరైన హిట్ కోసం వేచి చూస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా చిత్రమే 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంతో రాబోతుంది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉండగా.. వాటికి ఏమాత్రం తగ్గకుండా దీన్ని తీస్తున్నారు.
'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ మూవీల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు ఏర్పడడంతో పాటు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా షూటింగ్ సజావుగా సాగడం లేదు. దీంతో ఎన్నో పుకార్లు వస్తున్నాయి.

చాలా బ్రేకులు, అనుమానాల తర్వాత 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ గత వారంలోనే పున: ప్రారంభం అయింది. ఇందులో ఓ ఆఫీస్ ఎపిసోడ్‌కు సంబంధించిన సీన్లను షూట్ చేస్తున్నారు. ఇక, ఏమాత్రం బ్రేకులు లేకుండా చిత్రీకరణ జరిపి.. మహేశ్ బాబు సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ పట్టుదలగా ఉన్నట్లు తెలిసింది.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి ఎన్నో రకాల అంశాలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అయింది. దీని ప్రకారం.. ఫస్టాఫ్ మొత్తం డిఫరెంట్‌గా ఉన్న మహేశ్ బాబు.. ఇంటర్వెల్‌కు ముందు మాస్ అవతారం ఎత్తుతాడని తెలిసింది. ఈ ట్విస్టుకు అందరూ షాక్ అవుతారని సమాచారం.
అసలు అప్పటి వరకూ కూల్ అండ్ కామ్‌గా ఉన్న హీరో.. ఒక్కసారిగా తనలోని గుంటూరు పౌరుషాన్ని ఎందుకు చూపించాడు అన్నది సెకెండాఫ్‌లో చూపిస్తారని తెలిసింది. ఫస్టాఫ్ మొత్తం సరదాగా సాగినా.. రెండో సగం మాత్రం ఎంతో సీరియస్‌గా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో మహేశ్ బాబు వేరియేషన్స్ హైలైట్‌గా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా, 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











