షకీలా భర్త కత్తి మహేష్.. షాకిచ్చిన సెక్సీ తార.. ఇదీ సంగతి
Recommended Video
శృంగార తారగా షకీలా ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒకప్పుడు రసిక ప్రియుల ఆరాధ్యదైవంగా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది షకీలా. కొన్ని థియేటర్స్ ఆమె సినిమాల కోసమే ప్రత్యేకంగా కేటాయించబడేవి అంటే అర్థం చేసుకోవచ్చు షకీలా సెక్సీ క్రెడిట్ ఎలా ఉండేదో!. అయితే పెరుగుతున్న ఆధునికత, ఇంటర్నెట్ బాగా విస్తరించడంతో షకీలా క్రెడిట్ పడిపోయింది. కానీ ఆమె జీవితంలో పడిన కష్టాలు, ఆసక్తికర సంగతులు ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇదిలా ఉంటే సెన్సేషనల్ కింగ్ కత్తి మహేష్, షకీలా భర్త అని తెలియడంతో జనాలు మరింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. దానిపై పూర్తి వివరాలు చూద్దామా..

షకీలా భర్త కత్తి మహేష్
అవును.. నిజమే! షకీలా భర్త కత్తి మహేష్. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు కదూ!. షకీలా భర్త కత్తి మహేష్ అనే మాట నిజమే గానీ అది నిజ జీవితంలో కాదండోయ్.. వెండితెరపై. అదే సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా 'కొబ్బరి మట్ట' ఉంది కదా.. అందులో షకీలా భర్తగా నటించాడు సంచలన క్రిటిక్ కత్తి మహేష్.

షకీలా రీ ఎంట్రీ
గతంలో సెక్సీ స్టార్ గా మంచి గుర్తింపు పొందిన షకీలా.. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఇటీవల జరిగిన కొన్ని ఇంటర్వూస్ లో తన జీవితంలో పడిన కష్టాలు, సొంత అక్క చేతిలో మోసపోయిన తీరు చెప్పి ఆమె ఫాన్స్ కళ్ళలో కన్నీరు నింపింది. ఇక తాజాగా అవన్నీ మరిచి మరోసారి 'కొబ్బరి మట్ట' సినిమా ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది షకీలా. ఈ చిత్రంలో కత్తి మహేష్ తో జోడీ కట్టడం ఆసక్తిగా మారింది.

కత్తి మహేష్ క్యారెక్టర్ పై షకీలా స్పందన
కత్తి మహేష్‌కి భార్యగా నటించడంపై స్పందించిన షకీలా.. ‘కొబ్బరిమట్ట' సినిమా సమయంలో కత్తి మహేష్ ఎవరన్నది నాకు తెలియదు. కానీ ఆ తర్వాత ఆయన ఎంత కాంట్రవర్శీ కింగ్.. అన్నది విన్నాను. ఇక సంపూర్ణేష్ బాబును తీసుకొచ్చి సినిమాలో హీరో ఇతనే అని పరిచయం చేశారు. నేను వెంటనే.. వాట్? హీరోనా? అనేశాను అని పేర్కొంది షకీలా.

కొబ్బరి మట్ట మూవీ
సంపూర్ణేష్ బాబు కెరీర్ లో మూడో సినిమాగా వస్తోంది కొబ్బరి మట్ట మూవీ. కథ - స్క్రీన్ ప్లే - మాటలను స్టీవెన్ శంకర్ అందించిన ఈ సినిమాకి రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో.. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి సంపూ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు.


Click it and Unblock the Notifications











