twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    V ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: యంగ్ హీరోలిద్దరూ అప్పుడు విడివిడిగా.. ఇప్పుడు ఒక్కటై!

    |

    టాలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న నాచురల్ స్టార్ నాని.. ఈ సారి సరికొత్త కథాంశం, సరికొత్త లుక్‌లో V సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసి ఆకట్టుకుంది చిత్రయూనిట్.

    విలన్ సెంట్రిక్ మూవీ.. గత సినిమాలకు పూర్తి భిన్నంగా నాని

    విలన్ సెంట్రిక్ మూవీ.. గత సినిమాలకు పూర్తి భిన్నంగా నాని

    V చిత్రంలో నాని పోషిస్తున్న రోల్ ఆయన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండనుంది. ఇందులో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. చిత్రంలో నాని ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండటం V మూవీలో ఆసక్తికర అంశం. విలన్ సెంట్రిక్ మూవీ కాబట్టి V అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.

    సైకో కిల్లర్‌ నాని.. పోలీస్ ఆఫీసర్‌ సుధీర్ బాబు

    సైకో కిల్లర్‌ నాని.. పోలీస్ ఆఫీసర్‌ సుధీర్ బాబు

    V మూవీలో నాని సైకో కిల్లర్‌ (రాక్షసుడు)గా కనిపించబోతున్నాడని టాక్. ఇక మరో హీరో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్‌ (రక్షకుడు)గా కనిపించబోతున్నాడు. అందాల భామలు నివేదా థామస్, అతిథి రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది.

    అప్పుడు విడివిడిగా.. ఇప్పుడు ఒక్కటై

    ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు. ఇప్పటికే నాని, సుధీర్ బాబు ఇంటెన్సివ్ లుక్స్ విడివిడిగా రిలీజ్ చేసి V మూవీపై ఆసక్తి కలుగజేసిన మేకర్స్.. తాజాగా ఈ ఇద్దరి లుక్స్ ఓకే పోస్టర్ ద్వారా రిలీజ్ చేసి మరింత ఆకట్టుకున్నారు. ఈ పోస్టర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన నాని.. టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించాడు. ఫిబ్రవరి 17న V టీజర్ రిలీజ్ కానుందని తెలిపాడు.

    Recommended Video

    Nani's Tuck Jagadish Movie Opening Video | #Nani26 | Shiva Nirvana
    నాని 25.. భారీ అంచనాలు

    నాని 25.. భారీ అంచనాలు

    నాని కెరీర్‌లో 25వ సినిమాగా V మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిస్తున్నారు. శిరీష్‌,ల‌క్ష్మ‌ణ్‌,హ‌ర్షిత్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. చిత్రానికి ''సైరా'' ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. వైవిధ్యమైన కథాంశాలతో ముందుకెళ్తున్న నాని మొదటిసారి ఈ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌గా కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    English summary
    Nani's upcoming movie 'V' which is directed by Mohan Krishna Indraganti. On this movie Nani will play a vilan role. Now from this movie fresh poster released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X